రాజస్థాన్ (Rajasthan)లోని ఉదయపూర్ (Udaipur)లో జరిగిన ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. మన దేశానికి వచ్చిన ఫ్రెంచ్ టూరిస్ట్ (French Tourist) యువతి (Young Woman)పై సిద్ధార్థ్ (Siddharth) అనే యువకుడు అత్యాచారానికి (Rape) ఒడిగట్టిన దుర్ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటన జూన్ 23, సోమవారం రాత్రి చోటుచేసుకుంది. బడగావ్ పోలీస్ స్టేషన్ (Badgaon Police Station) పరిధిలోని టైగర్ హిల్స్ (Tiger Hills) ప్రాంతంలో ఈ ఘటన జరగ్గా, విదేశీ టూరిస్టుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
బాధితురాలైన ఫ్రెంచ్ యువతి జూన్ 22న ఢిల్లీ (Delhi) నుంచి ఉదయపూర్ (Udaipur)ను సందర్శించేందుకు వచ్చి, అంబమాత ప్రాంతంలోని ఓ హోటల్లో బస చేసింది. సోమవారం సాయంత్రం టైగర్ హిల్స్‌లోని గ్రీక్ ఫామ్ కేఫ్ అండ్ రెస్టో (Greek Farm Cafe Resto)లో జరిగిన పార్టీకి హాజరైంది. అక్కడ ఆమెకు సిద్ధార్థ అనే యువకుడు పరిచయమై, ఉదయపూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూపిస్తానని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన యువతి అతనితో కలిసి బయటికి వెళ్లగా, సిద్ధార్థ ఆమెను తన అపార్ట్మెంట్ (Apartment)కు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఘటన అనంతరం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను ఉదయపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రి వైద్యులు యువతి దుస్థితిని గమనించి, వెంటనే బడగావ్ పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించారు. బాధితురాలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, పోలీసులు సిద్ధార్థపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సిద్ధార్థ పరారీలో ఉన్నాడని, అతడిని గుర్తించేందుకు పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని బడగావ్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ పూర్ణ సింగ్ రాజ్‌పురోహిత్ తెలిపారు. కేఫ్‌లోని సీసీటీవీ ఫుటేజ్, ఆరోపితో బాధితురాలి పరిచయ వివరాలను సేకరిస్తున్నామని వెల్లడించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఈ ఘటన రాజస్థాన్‌లో విదేశీ టూరిస్టుల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తింది. రాజస్థాన్‌లో గతంలో కూడా విదేశీ టూరిస్టులపై దాడులు జరిగిన నేపథ్యంలో, పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నారు. సిద్ధార్థ అరెస్టు కోసం ఉదయపూర్‌లోని సుఖేర్, టైగర్ హిల్స్ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగాచర్చనీయాంశంగా మారడంతో, టూరిస్ట్ భద్రత కోసం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.









‘చిన్నోడు.. పెద్దోడు’.. టీడీపీ మీడియాపై అంబటి సెటైర్లు