ఇద్దరు పిల్లలను చంపేసి.. ప్రియుడితో హనీమూన్‌కు ప్లాన్‌

ఇద్దరు పిల్లలను చంపేసి.. ప్రియుడితో హనీమూన్‌కు

అమ్మ (Mother) అంటే ఆప్యాయతకు, మమకారానికి ప్రతిరూపం. కానీ కొంతమంది తల్లుల ప్రవర్తన చూస్తే హృదయం తలపోతుంది. ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh))లోని ముజఫర్‌నగర్ (Muzaffarnagar) జిల్లాలో చోటు చేసుకున్న ఓ పాశవిక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ప్రియుడి(Lover)తో హనీమూన్‌ (Honeymoon))కు వెళ్లాలనే కోరికతో ఓ తల్లి… కన్న బిడ్డల్ని (Own Children) చంపేసింది(Killed).

ముజఫర్‌నగర్ జిల్లా రోడ్కాలి (Rodkali) గ్రామానికి చెందిన ముస్కాన్ (Muskan) (24)కి ఇద్దరు పిల్లలు అర్హాన్ (Arhan) (5), ఇనాయ (Inaya) (1) ఉన్నారు. ఆమె భర్త వసీం, ఉద్యోగ నిమిత్తం చండీగఢ్‌ (Chandigarh)లో ఉంటున్నాడు. ఈ సమయంలో ముస్కాన్, జునైద్ (Junaid) అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుంది. ఈ క్ర‌మంలో ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని భావించిన ఆమె.. తల్లిగా తన బిడ్డలు అడ్డంగా ఉన్నారని భావించి క్రూరమైన‌ నిర్ణయం తీసుకుంది. వారిద్దరికీ విషం ఇచ్చి హత్య చేసింది.

పోలీసుల దర్యాప్తులో నిజాలు
పిల్లల మరణంపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో ముస్కాన్ ప్రమేయం ఉన్న‌ట్లుగా పోలీసులు నిర్ధారించారు. ఆమెను అరెస్టు చేసిన పోలీసులు, విచారణలో నేరం అంగీకరించిందని వెల్లడించారు. పిల్లల్ని చంపిన తర్వాత జునైద్‌తో కలిసి హనీమూన్‌కి వెళ్లాలని ముందే ప్లాన్ చేసిందని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment