హీరో ఆర్య ఇంట్లో ఐటీ సోదాలు.. రెస్టారెంట్ సీజ్!

హీరో ఆర్య ఇంట్లో ఐటీ సోదాలు.. రెస్టారెంట్ సీజ్!

Summarize with AI


తమిళ స్టార్ హీరో (Tamil Star Hero) ఆర్య (Arya), నటుడిగానే కాకుండా నిర్మాత (Producer)గా, వ్యాపారవేత్త (Businessman)గానూ రాణిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన అభిమానగణాన్ని సంపాదించుకున్నారు. అయితే, తాజాగా బుధవారం ఉదయం ఈ హీరో ఇంట్లో(House) ఆదాయపు పన్ను (ఐటీ) అధికారులు (Income Tax Officials) దాడులు నిర్వహించారు. ఆర్యపై పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చినట్లు తెలుస్తోంది.

‘సీ షెల్’ రెస్టారెంట్స్‌పై ఐటీ దాడులు
సౌత్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఆర్య ఒకరు. తమిళంతోపాటు తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘రాజారాణి’ (Raja Rani) సినిమాతో తమిళం, తెలుగులో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కోలీవుడ్‌లో ‘అవన్-ఇవాన్’, ‘సర్పట్ట పరంబరై’, ‘నాన్ కడవుల్’, ‘కాదల్ సొల్ల వందేన్’ వంటి అనేక హిట్ సినిమాల్లో నటించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బుధవారం తెల్లవారుజామునే ఆర్య ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆర్యకు చెందిన ‘సీ షెల్’ (Sea Shell) అనే హోటల్ (Hotel Restaurant) రెస్టారెంట్ చైన్ ఉండగా, ఈ హోటల్ నుంచి ఆర్య భారీ మొత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నాడని సమాచారం.

అయితే, ఈ హోటల్ నుంచి వచ్చే సంపాదన గురించి ప్రభుత్వానికి ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని, పన్ను ఎగవేత ఆరోపణలు రావడంతో అధికారులు ఏకకాలంలో ఆర్య ఇంటితోపాటు ‘సీ షెల్’ రెస్టారెంట్‌కు సంబంధించిన బ్రాంచులపై దాడులు నిర్వహించారు. అన్నా నగర్, వేలచ్చేరి, కుట్టివాకం, కిల్పాక్ సహా మరికొన్ని ప్రదేశాలలో ఆర్యకు చెందిన హోటళ్లపై ఐటీ అధికారులు (IT Officials) దాడులు చేశారు. కొచ్చి (Kochi)లో ఆర్యకు చెందిన కొన్ని ప్రదేశాలు, వ్యాపారాలు, హోటళ్లపై దాడులు జరగడానికి ఇది ఒక్కటే కారణం కాదని తెలుస్తోంది. ఈ ఉదయం హోటళ్లు తెరవడానికి ముందే పన్ను శాఖ అధికారులు దాడులు చేసి వారి ఖాతాలను తనిఖీ చేస్తున్నారు.

ఆర్య వ్యాపార విస్తరణ, భవిష్యత్ ప్రాజెక్టులు
సినిమాలే కాకుండా ఆర్య వ్యాపార రంగంలోనూ రాణిస్తున్నారు. ఆయనకు రియల్ ఎస్టేట్ (Real Estate) వ్యాపారం (Business) కూడా ఉంది. ఆర్య ఇప్పటివరకు తమిళం, మలయాళం మొత్తం కలిపి దాదాపు 11 సినిమాలను నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించారు. ప్రస్తుతం ఆయన ‘మిస్టర్ ఎక్స్’, ‘అనంతన్ కడు’ చిత్రాల్లో నటిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment