లిక్కర్ కేసు (Liquor Case)లో మరో వైసీపీ కీలక నేత అరెస్టు అయ్యారు. చంద్రగిరి (Chandragiri) మాజీ ఎమ్మెల్యే, వైసీపీ(YSRCP) సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి (Chevireddy Bhaskar Reddy) లిక్కర్ కేసులో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం (Bengaluru International Airport)లో అరెస్టయ్యారు(Arrested). సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు (SIT Officials) ఆయనను, సన్నిహితుడు వెంకటేష్ నాయుడు (Venkatesh Naidu)ను అదుపులోకి తీసుకుని విజయవాడ (Vijayawada)కు తరలించారు. ఈ అరెస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. లిక్కర్ కేసులో తప్పుడు వాంగ్మూలం ఇవ్వమని తనపై సిట్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని హెడ్ కానిస్టేబుల్ (Head Constable) మదన్‌రెడ్డి (Madan Reddy) డీజీపీ(DGP)కి లేఖ రాసిన రోజే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ అరెస్టవ్వడం సంచలనంగా మారింది.
లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డిని ఏ38గా సిట్ చేర్చింది. మద్యం డిస్టిలరీలు, సరఫరా కంపెనీల నుంచి సేకరించిన నగదును గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు చేరవేశారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 39 మందిపై కేసులు నమోదవ్వగా, అసలు ఎలాంటి ఆధారాలు లేని అంశంపై కూటమి ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని, వైసీపీలో కీలకంగా ఉన్నవారిని అరెస్ట్ చేసేందుకు లిక్కర్ కేసును సృష్టించారని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే, వైసీపీ నాయకులు పోలీసుల ఆరోపణలను ఖండిస్తూ, కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రతీకారం తీర్చుకుంటోందని మండిపడుతున్నారు. చెవిరెడ్డి గన్‌మెన్ (Chevireddy Gunman) గిరి(Giri), వ్యక్తిగత కార్యదర్శి బాలాజీలను విచారణ పేరుతో వేధించి, బలవంతంగా తప్పుడు వాంగ్మూలాలు రికార్డు చేశారని వైసీపీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంతకాలంగా తన సన్నిహితులను వేధించవద్దని సిట్‌ను కోరుతూ వచ్చారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, తనను ఇరికించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. వైసీపీ నాయకులు ఈ అరెస్ట్‌ను “రెడ్‌బుక్ రాజ్యాంగం” (Redbook Constitution)లో భాగంగా అభివర్ణిస్తూ, కూటమి ప్రభుత్వం ప్రతిపక్షాన్ని అణచివేయడానికి అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉంది.








