మార్కెట్ చూడకుండానే ఆకాశానికి రెమ్యునరేషన్లు? టాలీవుడ్‌లో కొత్త వివాదం!

మార్కెట్ చూడకుండానే ఆకాశానికి రెమ్యునరేషన్లు? టాలీవుడ్‌లో కొత్త వివాదం!

హీరోలు (Heroes), వారి రెమ్యునరేషన్ (Remuneration).. ఈ అంశాలపై ఇండస్ట్రీ (Industry)లో చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. నిర్మాతలు సరైన దారిలోనే వెళ్తున్నారా? హీరోలకు పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారా? మార్కెట్ చూడకుండా పారితోషికాలు ఆకాశానికి ఎత్తేస్తున్నారా? దిల్ రాజు (Dil Raju) మాట ఫాలో అవుతారా? అసలేంటి నిర్మాతల సమస్య.. దానికి హీరోలేం చేయాలి? చూద్దాం ప్రత్యేకంగా..

స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ – నిర్మాతల ఆవేదన
ఈ రోజుల్లో స్టార్ హీరోల రెమ్యునరేషన్స్ ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వారి పారితోషికాలు ఆకాశంలో ఉన్నాయి. ఇటీవల తెలంగాణ డిస్ట్రిబ్యూటర్ (Telangana Distributor) వి.ఐ. శ్రీధర్ (V.I. Sridhar) కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. డిజాస్టర్ హీరోలకు కూడా పిలిచి మరీ కోట్లు ఇస్తున్నారంటూ ఆయన చేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.

అయితే, హీరోల రెమ్యునరేషన్‌పై కొంతమంది నిర్మాతల వర్షన్ మరోలా ఉంది. ఇక్కడ డిమాండ్ అండ్ సప్లై నడుస్తుందని వారు అంటున్నారు. పైగా, హీరోలు తమకు దేవుళ్లతో సమానమని, వారికి ఎదురు చెప్పే ధైర్యం లేదని ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ అభిప్రాయపడ్డారు.

దిల్ రాజు సూచన, లాభాల్లో భాగస్వామ్యం
కానీ, ఇదే విషయంపై మరో నిర్మాత దిల్ రాజు వర్షన్ మాత్రం ఇంకోలా ఉంది. ఆయన మాట్లాడే తీరు మిగిలిన వాళ్లకు పూర్తి భిన్నంగా ఉంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ (Thammudu) ట్రైలర్ (Trailer) లాంచ్‌లో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయి. రెమ్యునరేషన్ విషయంలో హీరోలకు అర్థమయ్యేలా చెప్తే వారు వింటారని దిల్ రాజు అంటున్నారు.

గతంలో ‘బృందావనం’ అప్పుడు ఎన్టీఆర్, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సమయంలో ప్రభాస్, ‘వకీల్ సాబ్’ టైమ్‌లో పవన్ కళ్యాణ్, ఇప్పుడు నితిన్.. పారితోషికం విషయంలో పరిస్థితులు అర్థం చేసుకున్నారని దిల్ రాజు ఉదాహరించారు.

లాభ నష్టాలకు అతీతంగా ఉంటున్నారు మన హీరోలు. కానీ, ముందు కొంత రెమ్యునరేషన్ తీసుకుని.. సినిమా పూర్తయ్యాక మిగిలింది చూసుకుంటే బాగుంటుందనేది దిల్ రాజు వాదన. సుకుమార్, త్రివిక్రమ్, రాజమౌళి లాంటి దర్శకులు ఇప్పటికే లాభాల్లో వాటా (షేర్) తీసుకుంటున్నారు. కొందరు హీరోలు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారు. సినీ పరిశ్రమలో అందరూ ఇదే పద్ధతిని పాటిస్తే ఇండస్ట్రీ కూడా బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment