జూన్ 11న నితిన్ ‘తమ్ముడు’ ట్రైలర్

జూన్ 11న నితిన్ 'తమ్ముడు' ట్రైలర్

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ (Nithiin) నటిస్తున్న తాజా చిత్రం ‘తమ్ముడు’ (Thammudu) ట్రైలర్ (Trailer) విడుదల తేదీ (Release Date) ఖరారైంది. జూన్ 11న సాయంత్రం 5 గంటలకు ఈ ట్రైలర్ విడుదల కానుంది. దిల్ రాజు (Dil Raju) శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (Sri Venkateswara Creations) బ్యానర్ పై వేణు శ్రీరామ్ (Venu Sriram) తెరకెక్కిస్తున్న ఈ సినిమా జులై 4న థియేటర్లలోకి రానుంది.

‘కాంతారా’ ఫేమ్ సప్తమి గౌడ (Sapthami Gowda) ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తుండగా, లయ, వర్షా బొల్లమ్మ, స్వాసిక, బాలీవుడ్ నటుడు సౌరభ్ సచ్దేవ్ కీలక పాత్రలు పోషించారు. అజనీష్ లోకనాథ్ (Ajaneesh Loknath) సంగీతం అందిస్తున్నారు. ‘రాబిన్ హుడ్’ ప్లాప్‌తో నితిన్ కెరీర్‌కి ‘తమ్ముడు’ విజయం చాలా కీలకం కానుంది.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మంచి బజ్ క్రియేట్ చేయగా, ఇప్పుడు ట్రైలర్ విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఈ మధ్యకాలంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అందులో భాగంగా, ‘తమ్ముడు’ టీమ్ తమదైన స్టైల్‌లో ట్రైలర్ రిలీజ్ డేట్‌ను ప్రకటించింది. ఫిమేల్ లీడ్స్ లయ, వర్ష బొల్లమ్మ, స్వాసిక, సప్తమి గౌడ ఫన్నీ చిట్ చాట్‌తో కూడిన వీడియో ద్వారా ఈ తేదీని ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment