టాలీవుడ్ ఇండ‌స్ట్రీ సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ

టాలీవుడ్ ఇండ‌స్ట్రీ సమస్యల పరిష్కారానికి అంతర్గత కమిటీ

తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) నెలకొన్న సమస్యలు రోజురోజుకీ తీవ్ర‌రూపం దాల్చుతున్నాయి. మొన్న‌టి వ‌ర‌కు థియేట‌ర్ల‌న్నీ (Theaters) నిర్మాత‌ల (Producers చేతుల్లోనే ఉన్నాయ‌నే ఆరోప‌ణ‌లు, ఆ త‌రువాత జ‌నసేన నేత (Janasena Leader) స‌స్పెన్ష‌న్ (Suspension), టాలీవుడ్ పెద్ద నిర్మాత‌ల వివ‌ర‌ణలు ఇచ్చారు. ఆ త‌రువాత ఓటీటీలు, చిన్న థియేట‌ర్లు, మ‌ల్టీప్లెక్స్‌ల అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. టాలీవుడ్ ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌ల గురించి రోజుకో అంశం తెర‌పైకి వ‌స్తుంది.

ఈ త‌రుణంలో ఇండ‌స్ట్రీలోని స‌మ‌స్య‌ల‌ను ఇదంతా పరిష్కరించేందుకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను కలుపుకొని 30 మంది సభ్యులతో ఒక అంతర్గత కమిటీని (Internal Committee) ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు భరత్ భూషణ్ (Bharath Bhooshan) ఛైర్మన్‌గా, ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ (Damodara Prasad) కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

కమిటీ సభ్యుల వివరాలు
ఈ కమిటీలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి 10 మంది, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ నుంచి 10 మంది, ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి 10 మంది సభ్యులుగా ఎంపికయ్యారు.

ప్రొడ్యూసర్ సెక్టార్ సభ్యులుగా.. దామోదర ప్రసాద్, దిల్ రాజు, ప్రసన్న కుమార్, సి. కళ్యాణ్, రవి కిశోర్, రవిశంకర్, నాగవంశీ, దానయ్య, స్వప్న దత్, సుప్రియ.

డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ సభ్యులుగా.. భరత్ భూషణ్, సుధాకర్ రెడ్డి, ఎం. సుధాకర్, శిరీష్ రెడ్డి, వెంకటేష్ రావు, రాందాస్, నాగార్జున, సీడెడ్ కుమార్, భరత్ చౌదరి.

ఎగ్జిబిటర్ సెక్టార్ సభ్యులుగా.. రాంప్రసాద్, సురేష్ బాబు, సునీల్ నారంగ్, వీర నారాయణబాబు, శ్రీనివాసరావు, అనుపమ్ రెడ్డి, బాలగోవిందరాజు, మహేశ్వర రెడ్డి, శివప్రసాద్ రావు, విజయేందర్ రెడ్డి.

కమిటీ లక్ష్యం ఏంటంటే..
తెలుగు సినీ పరిశ్రమలో నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన రంగాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య సమన్వయం కుదిర్చి, పరిశ్రమ యొక్క సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు ఈ కమిటీ కృషి చేయనుంది. ఈ కమిటీ ఏర్పాటు ద్వారా పరిశ్రమలో సమస్యలను చర్చించి, వాటికి సామరస్యపూర్వక పరిష్కారాలను కనుగొనేందుకు ఒక వేదిక ఏర్పడనుంది.

తెలుగు సినీ పరిశ్రమలో ఇటీవల కాలంలో పలు సవాళ్లు, వివాదాలు తలెత్తుతున్నాయి. టికెట్ ధరలు, ఆన్‌లైన్ టికెటింగ్ షేర్లు, థియేటర్ నిర్వహణ ఖర్చులు వంటి అంశాలపై నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించడానికి, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో సమన్వయం, సహకారం మెరుగుపడి, పరిశ్రమ యొక్క సమస్యలకు శాశ్వత పరిష్కారాలు లభిస్తాయని ఆశిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment