జ‌వాన్ భూమి క‌బ్జా.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

జ‌వాన్ భూమి క‌బ్జా.. సెల్ఫీ వీడియో వైర‌ల్‌

ప్ర‌జ‌ల భ‌ద్ర‌త కోసం దేశ స‌రిహ‌ద్దులో కాప‌లా కాస్తున్న జ‌వాన్ (Soldier) భూమికే ర‌క్ష‌ణ లేకుండా పోయింది. నా భూమిని క‌బ్జాదారుల నుంచి ర‌క్షించండి అని వేడుకునే ప‌రిస్థితి దాపురించింది. ఆక్ర‌మ‌ణదారుల నుంచి త‌న భూమిని విడిపించ‌మ‌ని జ‌వాన్ ఏకంగా సెల్ఫీ వీడియో విడుద‌ల చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan), మంత్రి లోకేశ్‌ (Lokesh)‌ల సహాయం కోరుతూ విడుద‌ల చేసిన‌ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

జవాన్ ఆవేదన
శ్రీ స‌త్య‌సాయి జిల్లా (Sri Satya Sai District) హుదుగూరు (Huduguru)కు చెందిన జవాన్ నరసింహమూర్తి (Narasimhamurthy) సెల్ఫీ వీడియో (Selfie Video)లో త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. నా భార్య వాళ్ళ నాన్న భూమిని ఫీల్డ్ అసిస్టెంట్ (Field Assistant) నాగరాజు (Nagaraju) అనే వ్య‌క్తి కబ్జా (Occupied) చేశాడ‌ని, భూమిలో సాగు చేయడానికి వెళితే.. వెళ్లిన‌వారిపై రాళ్లు (Stones), కొడవ‌లి ఎత్తుకొని కొట్టడానికి వ‌స్తున్నాడ‌ని జ‌వాన్ ఆరోపించాడు. ఎన్ని సార్లు పోలీసులు, రెవెన్యూ అధికారులు చుట్టూ తిరిగిన ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. కోర్టు తీర్పు ఇచ్చినా త‌మ‌ భూమిని కబ్జా చేసి నాగరాజు అనే వ్య‌క్తి సాగు చేసుకుంటున్నాడ‌ని, ఈ మేరకు పవన్ కల్యాణ్, నారా లోకేశ్‌లు త‌న‌కు న్యాయం (Justice) చేయాల‌ని వేడుకున్నాడు. కోర్టు తీర్పును అమలుచేయాల్సిన రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని జవాన్ నరసింహమూర్తి ఆరోపించారు.

“నేను దేశాన్ని రక్షిస్తుంటే, నా కుటుంబాన్ని ఎవరు రక్షిస్తారు? కోర్టు తీర్పు మాకు అనుకూలంగా ఉన్నప్పటికీ, స్థానిక పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇది న్యాయమా?” అని ప్రశ్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియా వేదికల్లో వైరల్ కావడంతో, నెటిజన్లు జవాన్‌కు మద్దతుగా నిలిచారు. “దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టే సైనికుడి కుటుంబానికి ఈ దుస్థితి దారుణం” అని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. “జవాన్‌కు న్యాయం కావాలంటే ఇంకా ఎంతమంది చెప్పాలి?” అని మరికొంద‌రు ప్రశ్నించారు. స్థానిక అధికారుల నిర్లక్ష్య (Negligence) వైఖరిపై ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment