ప్రభాస్ (Prabhas) అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ది రాజాసాబ్’ (The Raja Saab) సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని, డబ్బింగ్ పనులు కూడా ముగిసినట్లు సమాచారం. ప్రస్తుతం రీ-రికార్డింగ్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. అతి త్వరలో ఈ చిత్ర టీజర్ (Teaser)ను విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, జూన్ 6, 2025న టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ విషయంపై ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.
మారుతి (Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ‘ది రాజాసాబ్’ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా భూత, వర్తమాన కాలాలను ఆధారంగా చేసుకుని రూపొందుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి హారర్ జోనర్లో నటించలేదు, టాలీవుడ్లో ఏ స్టార్ హీరో కూడా ఇలాంటి దెయ్యం కథాంశంతో సినిమా చేయలేదు. అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. టీజర్ విడుదలైన తర్వాత ఈ అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ (First Look Poster) తప్ప ఇతర అప్డేట్లు ఏవీ రాలేదు. అయితే, ఇకపై వరుసగా అప్డేట్లు వస్తాయని నిర్మాతలు సూచనలు ఇస్తున్నారు. ఈ సినిమాను డిసెంబర్ 5, 2025న థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.