మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలపై కవిత ఆగ్రహం

టీడీపీ (TDP – Telugu Desam Party) అధ్య‌క్షుడు, సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహానాడు (Mahanadu) వేదిక‌గా చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాజెక్టులను ఎప్పుడూ వ్యతిరేకించలేదని చంద్ర‌బాబు చెప్పడం హాస్యాస్పదంగా క‌విత‌ అభివర్ణించారు.

మీడియా చిట్‌చాట్‌లో క‌విత తెలంగాణ ప్రాజెక్టుల (Telangana Projects) గురించి ఆస‌క్తికర‌ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తన ముఖ్యమంత్రి పదవీ కాలం మొత్తంలో తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలోనే తెలంగాణ ప్రాజెక్టులను అడుగ‌డుగునా అడ్డుకున్నాడ‌న్నారు. బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి (Revanth Reddy)తో భేటీ అనంతరమే తెరపైకి వచ్చింది అని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

అంతేకాదు, ఇరిగేషన్ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని కవిత డిమాండ్ చేశారు. కవిత వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర చర్చలకు దారితీశాయి. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టుకు తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి స‌హ‌క‌రిస్తున్నారా..? అనే అనుమానాలు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు మరియు రాజకీయ సమీకరణాలపై ఈ వివాదం రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment