మూడేళ్ల బాలికపై అత్యాచారం: పవన్‌పై పూనమ్ కౌర్ సంచ‌ల‌న‌ ట్వీట్

మూడేళ్ల బాలికపై అత్యాచారం: పవన్‌పై పూనమ్ కౌర్ సంచ‌ల‌న‌ ట్వీట్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)‌ లో మూడేళ్ల (3-Year-Old) బాలిక (Girl)పై జరిగిన దారుణమైన అత్యాచార (Rape) ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘోర ఘటనపై టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ (Poonam Kaur) సోషల్ మీడియా వేదిక ఎక్స్‌(X)లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ (Pawan Kalyan)‌ను టార్గెట్ (Target) చేస్తూ సంచలన ట్వీట్(Tweet) చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పూనమ్ కౌర్ తన ట్వీట్‌లో.. పవన్ కళ్యాణ్ గతంలో రాజకీయంగా అధికారంలోకి రాకముందు “ఆడపిల్లలకు అన్నగా రక్షణగా ఉంటానని, మహిళలకు న్యాయం చేస్తానని” హామీలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలాంటి ఘోర ఘటనలపై ఆయన నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డాన్ని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. “మూడేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణ ఘటన గురించి మీడియా ఎందుకు కవర్ చేయడం లేదు? క్రిమినల్స్‌కు శిక్ష పడే వరకు మనం మన వాయిస్‌ను రైస్ చేయాలి, లేకపోతే మరొక చిన్నారి క్రూర మృగాల చేతిలో బలవుతుంది” అని ఆమె ఉద్వేగంగా రాసుకొచ్చారు.

ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుండి భారీ స్పందన లభిస్తోంది. కొందరు నెటిజన్లు “ఇలాంటి ఘటనలపై సెలబ్రిటీలు గొంతు వినిపించడం ఎంతో అవసరం” అంటూ పూనమ్ కౌర్‌ను అభినందిస్తున్నారు. అదే సమయంలో, మరికొందరు “వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇలాంటి అంశాలపై గట్టిగా స్పందించేవారు, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు..?” అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ లేదా ఆయన జనసేన పార్టీ నుండి ఇప్పటి వరకు అధికారిక స్పందన రాలేదు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలు, నిందితులపై చట్టపరమైన చర్యలపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ఘటన మహిళలు, బాలికల భద్రతపై మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment