రోడ్డుమీదే కారు ఆపి పబ్లిక్‌గా శృంగారలీలలు!

మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లోని ఢిల్లీ-ముంబయి (Delhi-Mumbai) 8 లేన్ ఎక్స్‌ప్రెస్‌వేపై (8-Lane Expressway) ఓ తెల్ల రంగు బాలెనో కారులో (Baleno MP14CC4782) మహిళతో (Woman) కలిసి అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వ్యక్తి వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సీసీటీవీలో రికార్డైన ఈ దృశ్యాల్లో ఉన్న వ్యక్తిని మనోహర్ లాల్ ధాకడ్ (Manohar Lal Dhakad)గా గుర్తించారు. ఈ వ్యక్తి రాజకీయ నేపథ్యం ఉండటంతో కలకలం రేగింది.

ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వేపై రాత్రి సమయంలో ఓ కారు అనుమానాస్పదంగా ఆగినట్టు అధికారులు గుర్తించి సీసీటీవీ పరిశీలించగా, అందులో మహిళతో కలిసి శృంగారంలో (Sexual Activity) పాల్గొంటున్న దృశ్యాలు నమోదయ్యాయి. అనంతరం వీడియో లీక్ అయ్యి సోషల్ మీడియాలో దూసుకెళ్లింది.

ఈ ఘటనపై మందసౌర్ జిల్లా భాన్‌పురా పోలీస్ స్టేషన్ (Bhanpura Police Station)లో మనోహర్ లాల్ ధాకడ్‌పై 296, 285, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కారులో ఉన్న మహిళ గుర్తింపుపై దర్యాప్తు కొనసాగుతోంది. వీడియో వైరల్ అయ్యిన తర్వాత ధాకడ్ తన ఫోన్ స్విచ్‌ఆఫ్ చేసి పరారయ్యారు.

వివాదంలో రాజకీయ కోణం కూడా బయటపడింది. మనోహర్ లాల్ ధాకడ్ బీజేపీ (BJP)కి చెందిన నాయకుడిగా ప్రచారం జరిగిన నేపథ్యంలో, మందసౌర్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్ దీక్షిత్ (Rajesh Dixit) స్పందించారు. ధాకడ్ బీజేపీ సభ్యుడైనా, పార్టీ పదవి ఎటువంటి బాధ్యత ఆయన వద్ద లేదని స్పష్టం చేశారు.

అయితే మనోహర్ లాల్ ధాకడ్ భార్య బీజేపీ మద్దతుతో జిల్లా పంచాయతీ 8వ వార్డుకు ఎన్నికయ్యారని సమాచారం. దీంతో పార్టీ స్థాయిలో ధాకడ్‌పై దూరంగా ఉండే విధానాన్ని బీజేపీ అనుసరిస్తోంది.

ఈ ఘటనపై ధాకడ్ మానవ సంఘం (Dhakad Mahasabha Youth Association) తీవ్రంగా స్పందించింది. సంస్థ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న మనోహర్ లాల్ ధాకడ్‌ను పదవి నుంచి తక్షణమే తొలగించినట్టు అధ్యక్షుడు డాక్టర్ అర్జున్ ధాకడ్ (Dr. Arjun Dhakad) ప్రకటించారు. సంఘం పేరు చెడకుండా ఉండేందుకు ఈ చర్య తీసుకున్నామని వెల్లడించారు.

ఇప్పటివరకు మనోహర్ లాల్ ధాకడ్ పరారీలో ఉండగా, పోలీసుల గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాజకీయ పక్షాలు, పౌర సంఘాలు దీనిపై స్పందిస్తున్నాయి. ఈ ఘటనకు పూర్తి స్థాయిలో న్యాయ పరిష్కారం రావాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment