లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

లోకేశ్వరస్వామి అరెస్ట్.. బాలికపై లైంగిక దాడి కలకలం

కర్ణాటక (Karnataka) లోని పుణ్యక్షేత్రాల పవిత్రతకు మచ్చ తెచ్చే మరో దారుణ ఘటన బయటపడింది. రాయచూర్‌ (Raichur) కు చెందిన రామలింగ మఠాధిపతి (Ramalinga Mathadhipathi) లోకేశ్వరస్వామిపై (Lokeshwaraswamy) 17 ఏళ్ల మైనర్ బాలిక (Minor Girl)పై అత్యాచార ఆరోపణలు రావడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. స్వామీజీ బాలికను కిడ్నాప్ చేసి, రాయచూరులోని ఓ లాడ్జిలో రెండు రోజుల పాటు లైంగిక వేధింపులకు (Sexual Harassment) గురిచేశాడని ఆరోపణలు వచ్చాయి.

అంతటితో ఆగకుండా, ఈ నీచుడు బాలికను బాగల్‌కోట (Bagalkot) కు తీసుకెళ్లి అక్కడ కూడా ఆమెపై లైంగిక దాడి చేశాడని, అనంతరం, మహాలింగపురం బస్టాండ్ (Mahalingapuram Bus Stand) వద్ద బాధిత బాలికను వదిలిపెట్టి, “ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తాను” అంటూ బెదిరించినట్లు సమాచారం.

ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. లోకేశ్వరస్వామిని అరెస్ట్ (Arrested) చేసిన పోలీసులు, అతనిపై అత్యాచారం, కిడ్నాప్, బెదిరింపు వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం అతడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు, మరియు ఈ ఘటన తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

ఇలాంటి ఘటనలు పవిత్ర క్షేత్రాలకు, సామాజిక విలువలకు కళంకం తెస్తున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో న్యాయం జరిగి, బాధిత బాలికకు తగిన రక్షణ, న్యాయం లభించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment