50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

50 వేల మందికి ప్రమోషన్.. వారిలో 15 వేల‌ మంది భారతీయులే

ప్రఖ్యాత ఐటీ సంస్థ యాక్సెంచర్ (Accenture) ఈ సంవత్సరం జూన్‌లో 50,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్ (Promotion) ఇవ్వనుంది. ఈ విష‌యాన్ని బ్లూమ్‌బెర్గ్ (Bloomberg) నివేదిక వెల్లడించింది. గత డిసెంబర్‌లో జరగాల్సిన ప్రమోషన్ ప్రక్రియ, ఆరు నెలల పాటు వాయిదా పడింది. తాజాగా బ్లూమ్‌బ‌ర్గ్ నివేదిక‌తో తెర‌పైకి వ‌చ్చింది. డబ్లిన్‌ (Dublin) లో ప్రధాన కార్యాలయంగా యాక్సెంచర్ కంపెనీ గ్లోబల్ కన్సల్టింగ్ అండ్ టెక్నాలజీ సేవల సంస్థగా పనిచేస్తోంది. కంపెనీ జారీ చేసిన అంతర్గత మెమో ప్రకారం జూన్ 2025 నాటికి ఈ ప్రమోషన్లను అమలు చేయనున్నారు.

భారతదేశానికి ప్రత్యేక ప్రాధాన్యత
ఈ ప్రమోషన్లలో భారతదేశం(India)లోనే అత్యధికంగా 15,000 మంది ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. ఇది మొత్తం గ్లోబల్ ప్రమోషన్‌లలో అత్యధికంగా ఉండటం గమనార్హం. భారత్ తర్వాత యూరోప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (EMEA) ప్రాంతాల్లో 11,000 మంది, అమెరికాస్ ప్రాంతాల్లో మరో 10,000 మంది ఉద్యోగులకు ప్రమోషన్లు అందనున్నాయి.

యాక్సెంచర్ తాజా ఆర్థిక నివేదిక ప్రకారం, సంస్థకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సుమారు 8,01,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అంటే ఈ జూన్‌లో మాత్రమే సుమారు 6 శాతం ఉద్యోగులకు పదోన్నతులు లభించనున్నాయి. డిమాండ్‌లో తగ్గుదల కారణంగా, కంపెనీ కొంతకాలంగా ఖర్చుల నియంత్రణపై దృష్టిపెట్టింది. పాండమిక్ సమయంలో డిజిటల్ సేవలకు అధిక డిమాండ్ ఉండటంతో మికెన్జీ, ఈవై వంటి సంస్థలతో పాటు యాక్సెంచర్ కూడా భారీగా హైరింగ్ చేసింది. అయితే ఇటీవల బిజినెస్ మందగమనం కారణంగా యాక్సెంచర్ 2023లో సుమారు 19,000 ఉద్యోగాలను తొలగించింది.

జీతాల పెంపు, బోనస్‌లు త్వరలో..
బ్లూమ్‌బెర్గ్ అందుకున్న అంతర్గత మెమోలో, కొన్ని కీలక గ్రోత్ ప్రాంతాల్లో బేస్ సాలరీ పెంపు కూడా ఉండనుందని కంపెనీ వెల్లడించింది. అయితే బోనస్‌లు, పనితీరు ఆధారిత ఈక్విటీ రివార్డ్స్ నిర్ణయం మాత్రం డిసెంబర్‌లో తీసుకోనున్నట్లు తెలిపింది. అలసటకు లోనవుతున్న ఉద్యోగుల్లో మళ్లీ ఉత్సాహాన్ని పెంచడం, పెర్ఫార్మెన్స్‌ను గుర్తించడం యాక్సెంచర్ లక్ష్యంగా పెట్టుకుంది. వివిధ ఆర్థిక, భౌగోళిక అనిశ్చితులను సమర్థవంతంగా ఎదుర్కొంటూనే, కంపెనీ ఉన్నత ప్రదర్శన చూపిన ఉద్యోగులకు గుర్తింపు ఇవ్వాలని భావిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment