హీరోయిన్ సమంత (Samantha) నిర్మాణంలో తెరకెక్కిన హర్రర్ కామెడీ (Horror Comedy) చిత్రం ‘శుభం’ (Shubham) శుక్రవారం థియేటర్లలో విడుదలై, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంది. ప్రవీణ్ కాండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, మొదటి షో నుంచే ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటోంది.
ప్రత్యేకంగా డైలీ సీరియల్స్ చూసే మహిళలకు ఈ కథ నిత్యజీవితంతో అనుబంధం ఉన్నట్లు అనిపించి బాగా కనెక్ట్ అయింది. హర్రర్ సన్నివేశాలు కొన్ని డ్రామాటిక్ టచ్ ఉన్నప్పటికీ, వాటిని నటీనటుల బలమైన అభినయం మరియు చక్కటి స్క్రీన్‌ప్లే బాగానే నెట్టుకొచ్చాయి.
సినిమాలో హాస్యం, భయం సమపాళ్లలో ఉండడం, ప్రధానంగా ఎమోషనల్ కంటెంట్‌తో నడిచిన కథ ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చేలా మారింది. సమంత నిర్మాణ సంస్థకు ఇది మంచి ఆరంభంగా భావించవచ్చ అంటున్నారు సినీ విశ్లేషకులు.