టీమిండియా (Team India) లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal) మాజీ భార్య (Former Wife) ధనశ్రీ వర్మ (Dhanashree Verma) తన గ్లామర్ కెరీర్‌లో అడుగులు వేస్తూ వరుస అవకాశాలతో బిజీగా గడుపుతోంది. డ్యాన్సర్‌గా పేరుపొందిన ఆమె ఇప్పుడు ఐటం సాంగ్స్ (Item Songs) చేస్తూ సహా నటిగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
తాజాగా రాజ్ కుమార్ రావు మరియు వామికా గబ్బీ జంటగా నటిస్తున్న ‘భూల్ చుక్ మాఫ్ (Bhool Chook Maaf)’ సినిమాలో ప్రత్యేక పాటలో చిందులు వేసింది ధనశ్రీ. ఈ పాటకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, ఆమె ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌కి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదల కానుండగా, ధనశ్రీ చేసిన ఈ ప్రత్యేక సాంగ్ హైలైట్‌గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
2020లో యూట్యూబర్, డ్యాన్సర్ ధనశ్రీని టీమిండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ పెళ్లిచేసుకున్నాడు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసిన తరువాత ఇటీవల ఈ సెలబ్రెటీ దంపతులు విడాకులు (Divorce) తీసుకున్నారు. ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు చాహల్ తరఫు న్యాయవాది నితిన్ కుమార్ గుప్తా (Nitin Kumar Gupta) వెల్లడించిన విషయం తెలిసిందే.