టాలీవుడ్ నితిన్ (Nithiin) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాబిన్ హుడ్’.(‘Robin Hood’) ఈ సినిమాలో ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందింది. ఈ సాంగ్(Song)లో హీరోయిన్ వేసిన స్టెప్స్ (Steps) ఇటీవల సోషల్ మీడియాలో వివాదాస్పదంగా (Controversial) మారిన విషయం తెలిసిందే. ఆ స్టెప్స్‌పై నెగెటివ్ కామెంట్స్ రావడంతో మేకర్స్ అవి సినిమా నుంచి తొలగించారు.
ఇప్పుడు ఈ అంశంపై హీరోయిన్ కేతికా శర్మ (Ketika Sharma) స్పందించింది. ‘‘నాకు ఈ వివాదం గురించి ఏమీ తెలియదు. నేను డైరెక్టర్ (director) చెప్పింది చేశాను. ముందు నుంచి నేనేమీ ఆలోచించలేదు. ఎవరు ఎలా భావిస్తారో ముందే ఊహించలేం’’ అని వ్యాఖ్యానించింది.
రాబిన్ హుడ్ సినిమా మార్చి 28న రిలీజ్ అయ్యింది. ఈ స్టెప్పులపై సోషల్ మీడియాలో వివాదం చెలరేగగా, మేకర్స్ ఆ సీన్స్‌ను తొలగించారు. నెల గడిచిన తరువాత హీరోయిన్ కేతికా శర్మ స్పందించడంపై అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సద్దుమణిగిన వ్యవహారాన్ని మళ్లీ ఎందుకు తెరపైకి తెస్తున్నారు అని కొందరు కామెంట్స్ చేస్తుండగా, ఆలస్యమైనా వివాదం గురించి తన దృష్టికి వచ్చిన వెంటనే హీరోయిన స్పందించడం అభినందనీయమని ఆమె ఫ్యాన్స్ సపోర్టుగా నిలుస్తున్నారు.