క్యూట్ ఫొటోతో గుడ్ న్యూస్ షేర్ చేసిన మెగా హీరో

క్యూట్ ఫొటోతో గుడ్ న్యూస్ షేర్ చేసిన మెగా హీరో

మెగా ఫ్యామిలీ (Mega Family) కాంపౌండ్ నుంచి మ‌రో శుభ‌వార్త బయటకు వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) తండ్రి (Father) కాబోతున్నట్టు స్వయంగా వెల్లడించారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ క్యూట్ ఫొటో (Cute Photo)ను షేర్ (Shared) చేసి అభిమానులకు గుడ్ న్యూస్ (Good News) చెప్పారు వ‌రుణ్ తేజ్‌. వివాహం జరిగిన కొద్ది నెలలకే వస్తున్న ఈ శుభవార్తతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు వరుణ్ తేజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మెగా హీరో వరుణ్ తేజ్, నటి లావణ్య త్రిపాఠి దంపతుల గురించి ఈ ఆసక్తికర వార్త గ‌త నాలుగు రోజుల‌ క్రితమే సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆ వార్త నిజ‌మేన‌ని సెల‌బ్రిటీ దంప‌తులు క‌న్ఫార్మ్ చేశారు. చాలాకాలం గుట్టుగా ప్రేమించుకున్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీక‌రాంతో 2023లో పెళ్లి చేసుకున్నారు. త్వ‌ర‌లో వ‌రుణ్‌-లావ‌ణ్య‌ (Varun–Lavanya) మొదటి బిడ్డను ఆహ్వానించనున్నారు. శుభవార్త చెప్పిన వరుణ్‌ దంపతులకు మెగా ఫ్యాన్స్‌, సెల‌బ్రిటీల నుంచి శుభాకాంక్ష‌లు (Congratulations) వెల్లువెత్తుతున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment