కోహ్లీ లైక్‌.. ఓవర్‌నైట్‌లో పెరిగిన‌ ఫాలోవర్స్‌

కోహ్లీ లైక్‌.. ఓవర్‌నైట్‌లో ఫాలోవర్ల వర్షం

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్టు (Instagram Post)కు లైక్ (Like) ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆ పోస్టు ఎవరిదంటే? యువ నటి అవనీత్ కౌర్‌ (Avneet Kaur)ది. ఈ ఒక్క లైక్‌తో అవనీత్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో మార్మోగుతోంది.

సోష‌ల్ మీడియా సమాచారం మేరకు.. కింగ్ కోహ్లీ ఓ పోస్టుకు కొట్టడంతో అవినీత్ కౌర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్కరాత్రిలోనే (Just One Night) ఏకంగా 5 లక్షల కొత్త ఫాలోవర్లు (New Followers) వచ్చారని తెలుస్తోంది. ఫాలోవర్ల పెరుగుదలతో పాటు, ఆమె మార్కెట్ విలువ కూడా అమాంతం పెరిగింది. ప్రస్తుతం ఒక్క ఇన్‌స్టా పోస్ట్‌కు తీసుకునే బ్రాండ్ ఛార్జ్ 30 శాతం పెంచిందట. అంతేకాదు, ఆమె నికర ఆదాయం రూ.5 కోట్ల మేర పెరిగి రూ.43 కోట్లకు చేరిందని బిజినెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సెల‌బ్రిటీలు త‌లుచుకుంటే మ‌రొక‌రిని సెల‌బ్రిటీగా త‌యారు చేయ‌గ‌ల‌రు అనే మాట‌కు ఈ సంఘ‌ట‌న ఒక నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. ఈ విష‌యం కింగ్ కోహ్లీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్‌కు అద్దం ప‌డుతుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment