కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆసిఫాబాద్ (Asifabad)లో జరిగిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) గురించి ఆయన విరుచుకుపడటం కాదు, ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) సోమవారం తెలంగాణ (Telangana) లో పర్యటించారు. రూ.5,400 కోట్లతో నిర్మించబోయే 26 రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేంద్రమంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీతక్క (Seethakka) పాల్గొన్నారు.
“కోమటిరెడ్డి బోళా మనిషి. ఎక్కడికెళ్లినా, ఏ మంత్రినైనా సముదాయించి పని చేయించగలరు” అని బండి (Bandi) అన్నారు. ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇంతేకాక, గత బీఆర్ఎస్(BRS) ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, “వారు మోదీని (Modi),, బీజేపీని (BJP) తిట్టడానికే పరిమితమయ్యారు. అభివృద్ధికి దారి మళ్లలేదు” అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్-కరీంనగర్-మంచిర్యాల మధ్య రాజీవ్ రహదారి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పరిష్కారం తీసుకొస్తే దానిని జాతీయ రహదారిగా అభివృద్ధి చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు.
నితిన్ గడ్కరీని పొగిడిన కోమటిరెడ్డి
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఒక మహానేత అని కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి అన్నారు. తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో నితిన్ గడ్కరీ లాంటి నాయకుడిని ఎప్పుడూ చూడలేదన్నారు. ఏ పని ఉందని వెళ్లినా ఒక్క నిమిషంలో పని పూర్తి చేసేవాడన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.