విజ‌య‌వాడ‌కు సీఎం రేవంత్.. ఎందుకంటే

విజ‌య‌వాడ‌కు సీఎం రేవంత్.. ఎందుకంటే

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు విజయవాడలో ప్రత్యేకంగా పర్యటించ‌నున్నారు. టీడీపీ సీనియర్ నాయకుడు, త‌న స‌న్నిహితుడు దేవినేని ఉమ మహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనడం కోసం ఆయన ఇవాళ ఉద‌యం విజ‌య‌వాడ‌కు రానున్నారు.

బుధ‌వారం ఉదయం 9:15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి, విజయవాడకు చేరుకోనున్నారు. ఉద‌యం 10.50 నుంచి 11.30 వరకు కృష్ణా జిల్లా కంకిపాడులో ఆయన్న కళ్యాణ మండపంలో దేవినేని ఉమ కుమారుని వివాహానికి హాజరుకానున్నారు. వివాహ వేడుకలో పాల్గొన్న అనంత‌రం మధ్యాహ్నం ఒంటి గంటలోపు తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ పర్యటన పూర్తిగా వ్యక్తిగతంగానే జరిగే కార్యక్రమంగా అధికారులు పేర్కొంటున్నారు.

హైద‌రాబాద్‌కు చేరుకున్న అనంత‌రం మధ్యాహ్నం 1.15 కు రవీంద్రభారతిలో పదో తరగతి వార్షిక ప‌రీక్ష ఫలితాలను సీఎం రేవంత్‌రెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు. సాయంత్రం రవీంద్రభారతిలో మహాత్మ బసవేశ్వర జయంతి ఉత్సవాల్లో పాల్గొన‌నున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment