సినిమాల్లో వీళ్లిద్దరూ ఎంత బాగున్నా.. రాజకీయాల్లో మాత్రం పవన్ కల్యాణ్ (Pawan Kalyan), ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) విధానాలు వేర్వేరు. సోషల్ మీడియాలో వీరి మధ్య జరిగే మాటల యుద్ధం ఇక నిత్యకృత్యం అయిపోయింది. పవన్ ఏదైనా మాట్లాడితే ప్రకాశ్‌రాజ్ స్పందించకుండా ఉండరు. ప్రకాశ్ ట్వీట్లు చేసినా జనసేన అభిమానులు ఆయన్ని కామెంట్ల రూపంలో దూషణలకు దిగుతారు. ఇప్పుడు మరోసారి అదే పునరావృతమైంది.
ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూకు హాజరైన విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రోమో ఒకటి విడుదలైంది. యాంకర్ అడిగిన ప్రశ్నలకు పవన్‌పై ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు. విజయ్, పవన్‌ల గురించి యాంకర్ ప్రశ్నించగా, వారిద్దరూ తనకు 20 ఏళ్లుగా తెలుసని, కానీ ఈ సుదీర్ఘ ప్రయాణంలో రాజకీయాలపై వారు సీరియస్‌గా మాట్లాడిన సందర్భాలు తక్కువే. సమస్యలపై వారికి అవగాహన లేదు. దృష్టికోణం లేదు అని సంచలన కామెంట్లు చేశారు ప్రకాశ్‌రాజ్.
పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ సడన్‌గా ఎంజీఆర్ (MGR) అంటాడు.. పెరియార్ (Periyar) అంటాడు.. ఏఐడీఎంకే (AIADMK) అంటాడు. నాలుగు పేర్లు తెలిసినంత మాత్రాన మనుషులు తెలిసినట్లు కాదని పవన్ ఎప్పుడు అర్థం చేసుకుంటాడని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎవరైనా చెప్పింది అర్థం చేసుకోరు.. ఆయన చెప్పేది ఎవరికీ అర్థం కాదు అంటారు కానీ, వాస్తవంగా పవన్‌కు ఏమీ తెలియదంటూ ప్రకాశ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యాంకర్ తన నియోజకవర్గం (Constituency) లో ఇటీవల జరిగిన కుల బహిష్కరణ (Caste Ostracism) ఘటనను ప్రస్తావించగా, ప్రకాశ్‌రాజ్ మరోసారి ఘాటుగా స్పందించారు. “తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, మహారాష్ట్రపై మాట్లాడే పవన్.. తన నియోజకవర్గంలోని సమస్యలపై ఎందుకు ఎప్పుడూ మౌనం వహిస్తారు” అని ప్రశ్నించారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ ప్రోమో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ప్రకాశ రాజ్‌పై జనసేన (JanaSena) శ్రేణులు అప్పుడే అసభ్యకర కామెంట్ల దాడి స్టార్ట్ చేశారు. మరి ఈ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి.
‘ఇది సినిమా కాదు బ్రదర్’.. – పవన్‌కు కాంగ్రెస్ ఎంపీ కౌంటర్