రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్

రాజ్యసభ అభ్యర్థిగా పాకా నామినేషన్

ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా ఏపీ బీజేపీ (AP BJP) క్ర‌మ‌శిక్ష‌ణ క‌మిటీ చైర్మ‌న్ పాకా వెంకట సత్యనారాయణ (Paka Venkata Satyanarayana) మంగళవారం నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. వైసీపీ మాజీ నేత విజ‌య‌సాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్య‌స‌భ స్థానానికి సోమ‌వారం సాయంత్రం బీజేపీ కేంద్ర నాయ‌క‌త్వం అభ్య‌ర్థిని నిర్ణ‌యిస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. అధిష్టానం ఆదేశాల మేర‌కు పాకా వెంక‌ట స‌త్య‌నారాయ‌ణ ఇవాళ నామినేష‌న్ దాఖ‌లు చేశారు.

ఏపీ శాసనసభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి (Returning Officer) శ్రీమతి వనితారాణికి (Vanitha Rani) ఆయన తమ నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జ‌న‌సేన శాసనసభ్యులు ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఎన్డీయే అభ్య‌ర్థి నామిష‌నేష‌న్ కార్య‌క్ర‌మంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రూ క‌నిపించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. నామినేష‌న్ అనంత‌రం పాకా స్వ‌యంగా వెళ్లి చంద్ర‌బాబును (Chandrababu) క‌లిసిన‌ట్లుగా స‌మాచారం.

Join WhatsApp

Join Now

Leave a Comment