సీఎస్‌గా రిటైర్డ్ అవ్వ‌గానే మ‌రో కీల‌క బాధ్య‌త‌

shanti-kumari-appointed-mcrhrdi-vice-chairperson

ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారికి (Shanti Kumari) తెలంగాణ ప్ర‌భుత్వం (Telangana Government) కీల‌క బాధ్య‌త‌లు (Key Responsibilities) అప్ప‌గించింది. సీఎస్‌గా రేపు ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నున్నారు. ఆమె సేవ‌లు వినియోగించుకోవాల‌ని భావించిన ప్ర‌భుత్వం శాంతికుమారికి మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (MCRHRDI) వైస్‌ ఛైర్‌పర్సన్‌గా నియ‌మించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (Chief Secretary) విధులు నిర్వర్తిస్తున్న ఆమె ఈ నెల 30న పదవీ విరమణ (Retirement) చేయనున్నారు.

పదవీ విరమణ అనంతరం, ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీఐ (MCRHRDI) వైస్‌ ఛైర్‌పర్సన్‌గా శాంతికుమారి బాధ్యతలు స్వీకరించనున్నారు. అంతేకాకుండా, ఆమెకు డైరెక్టర్ జనరల్ (Director General) హోదాలో పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు.

ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు (Raghunandan Rao) సోమవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. శాంతికుమారి గతంలో కూడా పలు కీలక పదవుల్లో పనిచేసిన అనుభవం ఉన్నా, ఇప్పుడు మానవ వనరుల అభివృద్ధి రంగానికి తన సేవలు మరింతగా ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment