తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party – TDP) నేత వీరయ్య చౌదరి (Veerayya Chowdary) హత్య కేసు (Murder Case) లో రోజుకో సంచలన విషయం బయటపడుతోంది. హత్య జరిగిన వెంటనే ప్రాథమిక పరిశీలన కూడా చేయకుండా ప్రత్యర్థి పార్టీకి అంటగట్టేందుకు కొందరు ప్రయత్నాలు చేసినప్పటికీ.. వీరయ్య హత్య తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి పనేనని తేలిపోయింది. తాజాగా ఈ కేసులో సంచలన నిజాలను వెలికితీసినట్లుగా తెలుస్తోంది.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. వీరయ్యను హత్య చేయడానికీ ఒక్కో కత్తిపోటుకు (Each Stab) నిందితులకు (Accused) రూ.2 లక్షల (Rs. 2 lakh) చొప్పున రివార్డు (Reward) ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో నిందితులు అతనిపై దాదాపు 53 కత్తిపోట్లు చేయగా, ఈ విషయాన్ని వైద్యులు అధికారికంగా ధృవీకరించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) సైతం వీరయ్య ఒంటిపై 40కి పైగా కత్తిగాయాలు ఉన్నట్లుగా ప్రకటించారు. ప్రస్తుతం, ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో పోలీసు బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక్కో కత్తిపోటుకు రూ.2 లక్షలు రికార్డు ఇచ్చారన్న వార్త హల్చల్ చేస్తుండగా, స్థానిక ప్రజలు షాక్కు గురవుతున్నారు. దీంతో వీరయ్య చౌదరి వ్యాపారాలపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.
వీరయ్య చౌదరి హత్యకు తెలుగుదేశం పార్టీలో ఆధిపత్యపోరే కారణమని తెలుస్తోంది. వీరయ్య చౌదరికి రియల్ ఎస్టేట్, మద్యం, పీడీఎస్ బియ్యం వంటి వ్యాపారాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలుకు చెందిన వీరయ్య చౌదరి హత్య వెనుక అదే ప్రాంతానికి చెందిన వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి (Veeragandham Devendranath Chowdary) హస్తం (Involvement) ఉన్నట్లుగా సమాచారం. కాగా, ప్రధాన నిందితుడు కోసం గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు పేర్కొంటున్నారు.








