భారతదేశాన్ని (India) కలిచివేసిన పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తరువాత, తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ భయానక ఘటన ప్రభావం బాలీవుడ్ (Bollywood) పై కూడా పడింది. ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొనాల్సిన ‘బిగ్ షాట్ (Big Shot)’ యూకే టూర్ (UK Tour) వాయిదా (Postponed) వేయబడింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నిర్వాహకులు, ఈవెంట్ మే 4, 5 తేదీల్లో జరగాల్సి ఉందని గుర్తుచేసుకున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా టూర్‌ను తాత్కాలికంగా నిలిపివేశామని తెలిపారు. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం అభిమానులు ఈవెంట్‌కు సంబంధించిన తాజా సమాచారం కోసం వేచి చూస్తున్నారు.
బాలీవుడ్ బిగ్ షాట్ యూకే టూర్‌కు సంబంధించిన కొత్త తేదీలు త్వరలోనే ప్రకటించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు తిరిగి చెల్లించనున్నట్టు వెల్లడించారు. ఇదిలా ఉండగా, పహల్గామ్ ఉగ్రదాడిని బాలీవుడ్ ప్రముఖులు సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అలియా భట్ తదితరులు తీవ్రంగా ఖండించారు.