తెలంగాణ (Telangana) – ఛత్తీస్గఢ్ (Chhattisgarh) సరిహద్దులోని కర్రెగుట్టల (Karreguttalu) అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు (Security Forces) విస్తృత స్థాయిలో ఐదు రోజులుగా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్లో భాగంగా ఛత్తీస్గఢ్ వైపు ఒక భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది.
భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య జరిగిన కాల్పుల్లో 38 మంది మావోయిస్టులు (Maoists) మృతి చెందినట్టు సమాచారం. ఈ ఘటనతో మావోయిస్టు శిబిరాల్లో ఉలిక్కిపాటు మొదలైంది. గత ఐదు రోజులుగా భద్రతా దళాలు కర్రెగుట్టల పరిసరాలలో దాడులు కొనసాగిస్తున్నాయి. సమాచారం మేరకు ఆ ప్రాంతంలో 1000 మందికి పైగా మావోయిస్టులు తలదాచుకుని ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే మావోయిస్టులు కూంబింగ్ ఆపరేషన్ను నిలిపేయాలని విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. కానీ భద్రతా బలగాలు మాత్రం తమ దాడుల్ని కొనసాగించాయి. తాజా ఎన్కౌంటర్తో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.