హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. అధికారులు అలర్ట్

హైదరాబాద్‌లో 208 మంది పాకిస్తానీలు.. అధికారులు అలర్ట్

పహల్గామ్ (Pahalgam) ఉగ్రదాడి ఘటన తరువాత దేశంలో ఉన్న పాకిస్తానీయులను (Pakistanis) వెనక్కు పంపించాలంటూ కేంద్రం (Central Government) ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల (States) ముఖ్య‌మంత్రుల‌కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) ఫోన్ చేశారు. పాకిస్తాన్ పౌరుల‌ను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఇప్పటికే పాకిస్తానీయుల వీసాలను (Visas) రద్దు చేసిన కేంద్రం.. రాష్ట్రాల‌ను కూడా అల‌ర్ట్ (Alert) చేసింది.

ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు (Telangana Police) అప్రమత్తమయ్యారు. హైదరాబాద్‌ (Hyderabad) లో నివ‌సిస్తున్న పాకిస్తానీల‌ను గుర్తించారు. ప్రస్తుతం 208 మంది పాకిస్థానీయులు (208 Pakistanis) హైద‌రాబాద్‌లో నివ‌సిస్తున్న‌ట్లుగా తేల్చారు. 208 మందిలో 156 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, 13 మందికి షార్ట్ టర్మ్ వీసాలు, 39 మంది కి బిజినెస్ వీసాలతో ఉన్న‌ట్లుగా గుర్తించారు. ఈనెల 27 కల్లా తమ దేశానికి వెళ్ళిపోవాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేప‌థ్యంలో పాకిస్తానీల‌ వివ‌రాల‌ను సేక‌రించి ప‌నిలో పోలీసులు నిమ‌గ్న‌మ‌య్యారు.

Join WhatsApp

Join Now

Leave a Comment