‘అఖండ 2’ టీజర్ వచ్చేస్తోంది – డేట్ ఫిక్స్!

'అఖండ 2' టీజర్ వచ్చేస్తోంది – డేట్ ఫిక్స్!

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) హిట్ కాంబో అంటే ఆ సినిమా మంచి మాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అని అభిమానుల‌కు ఒక అంచ‌నా ఉంది. వీరిద్ద‌రి కాంబోలో తెర‌కెక్కిన‌ చిత్రానికి సీక్వెల్ రాబోతుందంటే.. అది బాల‌య్య అభిమానుల‌కు పెద్ద శుభ‌వార్తే. 2021లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. మోస్ట్ అవైటెడ్ మూవీ ‘అఖండ-2’ (Akhanda 2) కి సంబంధించిన తాజా అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సారి కూడా మాస్ బీట్‌తో అదరగొట్టనున్నాడు. తాజా సమాచారం ప్రకారం, జూన్ 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘అఖండ 2’ టీజర్‌ (Teaser) ను రిలీజ్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన త్వరలో రానుంది. బాల‌య్య ఫ్యాన్స్‌కి ఈ బర్త్‌డే సర్‌ప్రైజ్ ఖచ్చితంగా పండగే అవుతుంద‌ని చిత్ర యూనిట్ అభిప్రాయంగా తెలుస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment