మహాపచారం.. అరుదైన‌ తాబేళ్ల మృతి, గుట్టుచ‌ప్పుడుగా ద‌హ‌నం

శ్రీకూర్మంలో మహాపచారం.. అరుదైన‌ తాబేళ్ల మృతి, గుట్టుచ‌ప్పుడుగా ద‌హ‌నం

నిర్వ‌హ‌ణ లోప‌మో, అల‌వాటుగా మారిన నిర్ల‌క్ష్య ధోర‌ణో కానీ.. ఏపీ (Andhra Pradesh) లోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో (Spiritual Shrines) వరుసగా జ‌రుగుతున్న‌ సంఘ‌ట‌న‌లు కూట‌మి ప్ర‌భుత్వానికి అప‌కీర్తి (Disrepute) తెచ్చిపెడుతున్నాయి. పవిత్రమైన తిరుమల (Tirumala) క్షేత్రంలో వరుస ఘటనలు మొదలు.. మొన్న గోశాలలో గోవుల మృతి వరకు అన్నీ ఘోరాలే.. కాగా, తాజాగా శ్రీ‌కాకుళం (Srikakulam) జిల్లాలోని ప్ర‌సిద్ధిగాంచిన శ్రీ‌కూర్మం పుణ్య‌క్షేత్రంలో అరుదైన న‌క్ష‌త్ర తాబేళ్లు (Rare Star Tortoises) మృత్యువాత‌ప‌డ‌డం (Died) భ‌క్తుల‌కు (Devotees) ఆందోళ‌న క‌లిగిస్తోంది. టీటీడీ (TTD) గోశాల‌లో శ్రీ‌వారికి అత్యంత ప్రీతిపాత్రమైన గోవులు (Cows) మృతిచెంద‌డం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బ‌తీసింది. ఆ ఘటన మరువక ముందే శ్రీ‌కూర్మంలో తాబేళ్ల మృతి, గుట్టుచ‌ప్పుడు కాకుండా ఈవో కార్యాల‌యం వెనుక ద‌హ‌నం చేసిన ఘ‌టన వెలుగులోకి వచ్చింది. శ్రీమహావిష్ణువు (Sri Maha Vishnu) అవతారమైన తాబేళ్లు మృతిచెంద‌డంపై భ‌క్తులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. మహాక్షేత్రంలో ప‌దుల సంఖ్య‌లో అరుదైన న‌క్ష‌త్ర తాబేళ్లు చనిపోవడంపై భ‌క్తులు మండిప‌డుతున్నారు.

మహావిష్ణువు రెండో అవతారం
హిందూ పురాణాల ప్రకారం విష్ణువు దశావతారాల్లో రెండోది కూర్మావతారం. క్షీర సాగర మథనంలో శ్రీమహావిష్ణువు కూర్మావతారం (Sri Maha Vishnu’s Kurma Avatar) (తాబేలు) ఎత్తి.. అసురులు, దేవ‌త‌లు క‌వ్వంగా చిలికే ప‌ర్వ‌త భారాన్ని స‌ముద్రం అడుగున ఉండి భ‌ర్తిస్తాడు. అప్ప‌టి నుంచి తాబేలును శ్రీమహావిష్ణువుగా కొల‌వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ప్ర‌తి ఇళ్లు, వాణిజ్య‌, వ్యాపార కార్యాల‌యాల్లో తాబేలు క‌చ్చితంగా ఉంటుంది. తాబేలు ఉంటే శుభం క‌లుగుతుంద‌ని హిందూబంధువుల న‌మ్మ‌కం.

గుట్టుచ‌ప్పుడు కాకుండా ద‌హ‌నం..
శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం పట్ణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకూర్మం పుణ్య క్షేత్రం ప్రసిద్ధి గాంచింది. శ్రీమహావిష్ణువు కూర్మావతారం రూపంలో పూజించే ఏకైక క్షేత్రం శ్రీకూర్మం (Srikurmam) ఒక్కటే. కూర్మావతారం పేరు మీదనే ఈ గ్రామానికి శ్రీకూర్మం అనే పేరుంది. శ్రీ‌మహావష్ణువు కూర్మ రూపంలో వెలిసిన చోట అరుదైన నక్షత్ర తాబేళ్లు ప‌దుల సంఖ్య‌లో మృత్యువాతప‌డ్డాయి. తాబేళ్ల మృతివార్త బ‌య‌ట‌ప‌డ‌కుండా, ఈవో కార్యాలయం వెనుకే దహనం చేశారు. ఇది గ‌మ‌నించిన స్థానికులు వీడియో చిత్రీక‌రించ‌గా, అది కాస్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంపై భ‌క్తుల ఆగ్ర‌హం..
శ్రీ కూర్మానాధ ఆలయంలో (Srikurmanatha Temple) మృతిచెందిన తాబేళ్లను నిబంధన ప్రకారం పోస్టుమార్టం (Postmortem) చేయకుండా దహనం చేయ‌డంపై భ‌క్తులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఏపీ (Andhra Pradesh)లో కూటమి పార్టీలు (Coalition Parties) అధికారంలోకి వ‌చ్చిన నాటినుంచి ఆలయాలు, వాటి పవిత్రతకు మచ్చ తెచ్చేలా అనేక అపచారాలు వరుసగా చోటు చేసుకుంటున్నాయని భ‌క్తులు ఆరోపిస్తున్నారు. ఆలయాల నిర్వహణలో రాజకీయ జోక్యం, తమ అనుయాయులకు అప్పగించి ప‌రిర‌క్ష‌ణ‌ను గాలికివ‌దిలేశార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. హిందువులు స‌క‌ల దేవ‌త‌ల స్వ‌రూపిణిగా కొలిచే గోవులు.. సాక్షాత్తూ టీటీడీ గోశాలలో చ‌నిపోవ‌డం, తాజాగా శ్రీకూర్మంలో అరుదైన న‌క్ష‌త్ర తాబేళ్లు మృత్యువాత‌ప‌డ‌డం భ‌క్తుల‌కు ఆగ్ర‌హం తెప్పిస్తోంది. ప్ర‌భుత్వ పర్యవేక్షణ లోపంతోనే ఇలా జరుగుతోందని భక్తులు వాపోతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment