హోట‌ల్‌లో మంట‌లు.. తృటిలో త‌ప్పించుకున్న SRH టీమ్

హోట‌ల్‌లో అగ్నిప్రమాదం.. తృటిలో త‌ప్పించుకున్న SRH టీమ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో పోటీ పడుతున్న సన్‌రైజ‌ర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ఒక ప్రమాదం (Accident) తృటిలో తప్పింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ (Banjara Hills) ప్రాంతంలోని ప్రముఖ పార్క్ హయత్ హోటల్‌ (Park Hyatt Hotel) లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్‌ బసచేసిన సమయంలో అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది.

హోటల్ మొదటి అంతస్తులో మంటలు చెలరేగి దట్టమైన పొగ చుట్టుముట్టింది. అప్రమత్తమైన హోటల్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ (Fire Department) కు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడం (No Injuries) ఊపిరిపీల్చే విషయంగా మారింది.

అధికారుల ప్రకారం, ఘటనకు గల కారణం ఇంకా నిర్ధారణ కాకపోయినా, హోటల్ సిబ్బంది అప్ర‌మ‌త్త‌మై చర్య తీసుకోవ‌డం వల్ల ప్రాణాపాయం త‌ప్పింద‌ని, SRH టీమ్ సభ్యులు పూర్తిగా సురక్షితంగా (Completely Safe) ఉన్నారని హోట‌ల్ యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment