నందమూరి కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి (Arjun S/O Vyjayanthi)’ ఈనెల 18న వరల్డ్ వైడ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. విడుదలకు ముందు ప్రేక్షకుల్లో హైప్ పెంచేందుకు, ఈరోజు (శనివారం) సినిమా ట్రైలర్ (Movie Trailer) లాంఛ్‌తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్ (Pre-Release Event)ను హైదరాబాద్‌లోని శిల్పకలావేదిక లో భారీగా నిర్వహించనున్నారు.
అన్నయ్య సినిమా వేడుకకు తమ్ముడు సిద్ధమవుతున్నారు. శిల్పకళావేదిక (Shilpakala Vedika) లో నిర్వహించే ఈ గ్రాండ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR) ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఎన్టీఆర్ హాజరుతో ఈ ఈవెంట్‌కు నందమూరి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కోసం ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అర్జున్ S/O వైజయంతి సినిమాలో కళ్యాణ్‌రామ్ తల్లిగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి నటించారు. ఈ మూవీలో ఆమె పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి తెరపై కనిపించనున్నారు.