రాప్తాడు (Raptadu) నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి (Papireddypalli) లో జరిగిన హత్యా ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ (Y. S. Jagan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల హత్యకు గురైన వైసీపీ (YSRCP) నాయకుడు కురుబ లింగమయ్య (Kuruba Lingamayya) కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించి (Consoled), పార్టీ అండగా నిలుస్తుందని భరోసా (Assurance) ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు.
రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు..
రాష్ట్రంలో శాంతిభద్రతలు (Law and Order) పూర్తిగా క్షీణించాయని, బీహార్ (Bihar) తరహా పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. ఎంపీపీ ఎన్నికల్లో టీడీపీ నమ్మకాలు, బెదిరింపులు వృథా కావడంతో వైసీపీ గెలిచిన చోట్ల హింసను ప్రేరేపించారని చంద్రబాబు (Chandrababu)పై జగన్ మండిపడ్డారు. రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలకు గానూ 9 వైసీపీ గెలుచుకుందని, ఒక్కచోట మాత్రమే టీడీపీ గెలిచిందని గుర్తుచేశారు. సంఖ్యాబలం లేకపోయినా పదవుల కోసం హింసను చంద్రబాబు హింసను ప్రేరేపిస్తున్నాడన్నారు. దారి కాచి వైసీపీ నేత లింగమయ్యను హత్య చేశారని, ఈ కేసులో నేరస్థులను వదిలేసి, తూతూ మంత్రంగా కేవలం ఇద్దరిపై కేసు పెట్టారని ఆరోపించారు. లింగమయ్య భార్యతో బలవంతంగా వేలిముద్ర (Fingerprint) తీసుకున్నట్టు, దాన్నే ఆధారంగా చేసి కేసును తప్పుదారి పట్టించారని పోలీసుల (Police) తీరుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను పక్క నియోజకవర్గంలోని ఎమ్మార్వో ఆఫీస్ (MRO Office) కు తీసుకెళ్లి బైండోవర్ చేయడం ఏంటని, ఎవరి మెప్పు కోసం పనిచేస్తున్నారంటూ ప్రశ్నించారు.
జగన్ మాస్ వార్నింగ్..
‘టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా సీఎం చంద్రబాబు (CM Chandrababu) మెప్పు కోసం పనిచేస్తున్న ప్రతీ పోలీస్ అధికారికి చెబుతున్నా.. ఎల్లకాలం చంద్రబాబు పరిపాలన (Rule) సాగదు. మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తూ చేస్తున్న తప్పునకు బట్టలూడదీస్తాం.. చట్టం ముందు నిలబెట్టి మీ యూనిఫాం (Uniform) తీయించి ఉద్యోగాలు లేకుండా చేస్తాం. ఇప్పటికైనా ప్రవర్తనలో మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం చంద్రబాబు పాలనే ఉండదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా (With Interest) లెక్కేసి దోషులుగా నిలబెట్టి.. మీతో కక్కించే కార్యక్రమం చేయిస్తామని హెచ్చరిస్తున్నా’ అని వార్నింగ్ (Warning) వైఎస్ జగన్ ఇచ్చారు.