రాబోయే మూడు రోజులు (Next Three Days) ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో వర్షాలు (Rains) కురువనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అల్పపీడనంగా మారిందని విశాఖపట్నం (Visakhapatnam) లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది వాయువ్య దిశగా కదులుతూ బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది.
ఈ పరిణామం కారణంగా రాబోయే రెండు నుంచి మూడు రోజుల మధ్య కోస్తా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. వర్షపాతం క్రమంగా పెరుగుతూ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలను కూడా ప్రభావితం చేసే అవకాశముంది. దీంతో ప్రజలు, వ్యవసాయదారులు, పర్యటనలకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ (Meteorological Department) సూచిస్తోంది.