ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి, 11 మందికి గాయాలు

కర్ణాటక (Karnataka) లో శనివారం తెల్లవారుజామున కలబురగి (Kalaburagi) జిల్లాలో ఘోర రోడ్డు ప్ర‌మాదం (Road Accident) చోటుచేసుకుంది. జెవర్గి తాలూకాలోని నెలోగి సమీపంలో ఆగి ఉన్న లారీని మినీ ట్రావెల్ బస్సు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు (Five people) అక్కడికక్కడే మరణించారు (Died). మరణించిన వారిని వాజిద్, మెహబూబి, ప్రియాంక, మెహబూబుగా గుర్తించారు. వీరంతా బాగల్కోట్‌కు చెందినవారని సమాచారం.

ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు (Injured). వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం సమయంలో బస్సు యాత్రికులతో నిండిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాద కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment