నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ వ‌ర్సెస్‌ జ‌న‌సేన‌

నాగ‌బాబు ప‌ర్య‌ట‌న‌లో ఉద్రిక్త‌త‌.. టీడీపీ వ‌ర్సెస్‌ జ‌న‌సేన‌

కాకినాడ జిల్లా (Kakinada District) గొల్ల‌ప్రోలు అన్నాక్యాంటీన్ (Anna Canteen) ప్రారంభోత్స‌వం వివాదాస్ప‌దంగా మారింది. ఎమ్మెల్సీగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన నాగ‌బాబు (Nagababu).. తొలి అధికార ప‌ర్య‌ట‌న కాంట్ర‌వ‌ర్సీ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది. గొల్ల‌ప్రోలు (Gollaprolu) లో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో టీడీపీ (TDP) పెద్ద‌ల‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan), వ‌ర్మ (Varma) ఫొటో ఉండ‌గా, జ‌న‌సేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మాత్రం పిఠాపురం (Pithapuram) టీడీపీ నేత వ‌ర్మ ఫొటో లేక‌పోవ‌డంతో టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అన్నా క్యాంటీన్ వ‌ద్ద‌కు జై వ‌ర్మ అంటూ నినాదాలు చేసుకుంటూ ర్యాలీగా వెళ్లారు. టీడీపీ కార్య‌క‌ర్త‌ల నినాదాల‌కు పోటీగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నినాదాలు చేశారు. దీంతో టీడీపీ-జనసేన (TDP-JanaSena) కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త‌త (Tension) వాతావ‌ర‌ణం నెల‌కొంది. అన్నా క్యాంటీన్‌ను నాగబాబు ప్రారంభిస్తుండగా జై వర్మ అంటూ టీడీపీ క్యాడ‌ర్ నినాదాలు చేశారు. ఇరుపార్టీల నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తంగా మార‌డంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.

జ‌న‌సేన పార్టీ ఆవిర్భావ స‌భ‌లో వ‌ర్మ గురించి, టీడీపీ క్యాడ‌ర్ గురించి నాగ‌బాబు చేసిన కామెంట్స్ మూలంగా టీడీపీ-జ‌న‌సేన మ‌ధ్య మాట‌ల యుద్ధం న‌డిచి గ్యాప్ ఏర్పడింది, మ‌రోసారి నాగ‌బాబు ప‌ర్య‌ట‌న కార‌ణంగానే ఈ రెండు పార్టీల‌ మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితి నెల‌కొన‌డంపై సీనియ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment