సీఎం గారూ.. నేను రేపో మాపో చచ్చిపోతా.. రేణుదేశాయ్ సంచ‌ల‌న వీడియో

సీఎం గారూ.. నేను రేపో మాపో చచ్చిపోతా.. రేణుదేశాయ్ సంచ‌ల‌న వీడియో

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌నసేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, ప్ర‌ముఖ న‌టి రేణుదేశాయ్ (Renu Desai) సంచ‌ల‌న వీడియో విడుద‌ల చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) భూముల రక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న పోరాటానికి ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా భావోద్వేగంగా స్పందించారు. “సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఒక తల్లిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నా వయస్సు 44 ఏళ్లు. నేను రేపో మాపో (Sooner or Later) చనిపోతాను (Will Die). కానీ నా బిడ్డలతో పాటు మరెంతో మంది పిల్లలకు చాలా భవిష్యత్తు ఉంది.

వాళ్లకు శుద్ధమైన గాలి (Pure Air), మంచినీరు (Clean Water) అవసరం. డెవలప్‌మెంట్ చాలా అవసరమే. అందులో డౌట్ లేదు. కానీ, ఎక్కడైనా.. ఒక్క పాజిబిలిటీ ఉన్నా.. ఈ ఒక్క 400 ఎకరాలను (Acres) వదిలేయండి. దీనికోసం నేను మీకు బెగ్గింగ్ చేస్తున్నాను. ఏదో ఒకటి ట్రై చేయండి సర్. మన రాష్ట్రంలో ఇంకా ఖాళీగా ఉన్న చాలా ప్రదేశాలు ఉన్నాయి. వాటిని తీసుకుని డెవలప్ చేయండి.

మీరు చాలా సీనియర్ నాయకులు, మీరు ఎన్నో విషయాల్లో చాలా ఎక్స్‌పట్స్. ప్లీజ్ ఇంకొక్కసారి ఆలోచించండి. మనకు ఆక్సిజన్, వాటర్ ఎంతో అవసరం సర్.. ప్లీజ్ ఆ 400 ఎకరాలను వదిలేయండి. హార్ట్ ఫుల్‌గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. మరొక్కసారి ఆలోచించండి.. మిగతా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని రేణుదేశాయ్ భావోద్వేగంతో ఓ వీడియోను రిలీజ్ చేశారు.

హెచ్‌సీయూ (HCU) భూముల‌ను స్వాధీనం చేసుకోవ‌ద్ద‌ని, వంద‌లాది జీవ‌రాశులు అట‌వీ ప్రాంతంలో ఉన్నాయ‌ని, వాటి మ‌నుగ‌డ‌ను ప్ర‌శ్నార్థ‌కంలో ప‌డేయ‌వ‌ద్ద‌ని విద్యార్థులు ఉద్య‌మం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనకు పెరుగుతున్న మద్దతుతో ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment