లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి.. జ‌ర్మ‌నీ యువతిపై గ్యాంగ్ రేప్‌

లిఫ్ట్ ఇస్తామ‌ని న‌మ్మించి.. జ‌ర్మ‌నీ యువతిపై గ్యాంగ్ రేప్‌

Summarize with AI

హైదరాబాద్ (Hyderabad) నగరంలో మరోసారి దారుణ ఘటన చోటుచేసుకుంది. మీర్‌పేట్ (Meerpet) వద్ద లిఫ్ట్ ఇస్తామ‌ని (Offered Lift) ఓ విదేశీ యువతిని నమ్మించి ముగ్గురు యువకులు ఆమెను పహాడీ షరీఫ్ (Pahadi Shareef) ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి (Sexual Assault) పాల్పడ్డారు. బాధిత యువతి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు జర్మనీ (Germany) కి చెందినవారని, సెలవుల కోసం హైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు తెలిపారు. షాపింగ్‌కు బయలుదేరిన ఆమె కారును ఆ ముగ్గురు యువకులు అడ్డగించి బలవంతంగా తీసుకెళ్లినట్లు సమాచారం.

ఈ ఘటన నగరంలో మహిళా భద్రతపై మరోసారి ఆందోళన రేపుతోంది. నిందితులను త్వరగా గుర్తించి కఠిన శిక్ష విధించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజ్ పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment