అనకాపల్లి జిల్లా యలమంచిలి (Yelamanchili) టీడీపీ నేతల్లో అసంతృప్తిబయటపడింది. యలమంచిలి కేడర్ మీటింగ్‌లో లోకేష్ (Lokesh) ముందే పార్టీ ఇంఛార్జ్ ప్రగడ నాగేశ్వరరావు (Pragada Nageswara Rao) సమస్యలు చెప్పుకున్నారు. టీడీపీ కేడర్ (TDP Cadre)కు న్యాయం చేయాలని నేతలు నారా లోకేశ్‌ను కోరారు. కూటమి ఫార్ములా పకడ్బందీగా అమలయ్యేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్తల సభలో మంత్రి నారా లోకేశ్ పార్టీలోని పలు అంతర్గత విషయాలను బయటపెట్టారు. తాను వైఎస్ జగన్ (YS Jagan) తో కంటే తన పార్టీలోని నాయకులతోనే ఎక్కువగా పోరాటం (Struggled More) చేశానని వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ నాయకులకు ఒక జబ్బు (Problem) ఉందని కార్యకర్తలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. స్టేజీ పైకి పిలవలేదని, కాఫీ, టీ ఇవ్వలేదని, పేపర్ అందించలేదని కార్యకర్తలు అలుగుతున్నారని, దానికి ఫుల్‌స్టాప్ పెట్టాలన్నారు. అలకకు పుల్‌స్టాప్ పెట్టి.. నమ్మకున్న దాని కోసం పోరాడాలి, తిరగాలని సూచించారు.
సీనియర్లు వ్యతిరేకించారా..?
లోకేశ్ పార్టీలోని నాయకులతోనే ఎక్కువగా పోరాటం చేశానని తన మనసులో మాటను బయటపెట్టారు. లోకేశ్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని, త్వరలో ఉన్నత హోదాలో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ఉన్నారని, అధినేత ఆలోచనలు పార్టీలోని పలువురు సీనియర్ల (Seniors) కు నచ్చడం లేదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పార్టీలోని కొందరు లోకేశ్ నాయకత్వంపై వైపు మొగ్గు చూపుతుండగా, సీనియర్లు మాత్రం చినబాబు అజమాయిషీని వ్యతిరేకించారట. పార్టీపై పట్టుకోసం తన మాటను వ్యతిరేకించే సీనియర్లతోనే లోకేశ్ ఎక్కువగా పోరాటం చేసి ఉండొచ్చని ఆయన వ్యాఖ్యల ఆధారంగా అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇటీవల ఓ సీనియర్ నాయకుడు తనకు దక్కుతుందనుకున్న సీటు కోల్పోయారు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి పార్టీ కోసం ఆయన సేవలు అందించిన విషయం తెలిసిందే.
రికార్డ్ చేస్తే ఫోన్లు అమ్మేస్తా..
మనం(జనసేన-టీడీపీ) తిట్టుకుందాం.. కొట్టుకుందాం.. విడాకులు (Divorce) మాత్రం అవుట్ ఆఫ్ క్వశ్చన్ (Out of Question) అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రోజు పార్టీలో తానే చిన్న యుద్ధం (Small Battle) చేస్తున్నానని చెబుతూనే.. సంస్కరణలు తీసుకురావాలనేదే తన తాపత్రయని వివరించారు. కార్యకర్తలతో ఇంటరాక్షన్ మీటింగ్‌లో రికార్డింగ్స్ (Recordings) చేయవద్దని, వీడియోలు (Videos) లీక్ అయితే బయట నుంచి మళ్లీ ట్రోల్స్ (Trolls) ఎదురుకోవాల్సి వస్తుందన్నారు. ఎవరైనా ఫోన్లు తీసి రికార్డ్ చేస్తే ఫోన్లు అమ్మేసి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా అని కార్యకర్తలకు లోకేశ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇక నువ్వు లైవ్ ఆపేసి కిందకి దిగిపో..
— Telugu Feed (@Telugufeedsite) March 31, 2025
ఇంటరాక్షన్ మీటింగ్ లో రికార్డింగ్స్ వొద్దు మళ్లీ ట్రోల్ చేస్తారు..
ఎవరైనా ఫోన్లు తీసి రికార్డ్ చేస్తే ఫోన్లు అమ్మేసి కార్యకర్తల నిధికి ఇచ్చేస్తా
– నారా లోకేష్#NaraLokesh #AndhraPradesh #TDP pic.twitter.com/P7HvuV324L