LKG విద్యార్థినిపై లైంగిక దాడికి య‌త్నం

LKG విద్యార్థినిపై లైంగిక దాడికి య‌త్నం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అమాన‌వీయ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిపై లైంగిక దాడికి (Sexual Assault) య‌త్నించిన ఘ‌ట‌న క‌ల‌క‌లం రేపుతోంది. ప్ర‌తినిత్యం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతంలో ఆడ‌వారిపై లైంగిక దాడులు, అరాచ‌కాలు, అఘాయిత్యాలు చోటుచేసుకుంటుండ‌గా, ఈ సంఘ‌ట‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ఆడ‌బిడ్డ‌లకు ర‌క్ష‌ణ (Safety) క‌రువైంద‌ని రుజువు చేస్తోంది.

విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam) లో జ‌రిగిన ఈ సంఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. LKG ( లోయ‌ర్‌ కిండర్ గార్టెన్) చ‌దువుతున్న చిన్నారిపై PET (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) లైంగిక దాడికి య‌త్నించాడు. ఈ విష‌యం త‌ల్లిదండ్రులు గుర్తించి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ⁠పీఎం పాలెం (PM Palem) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని పోక్సో చట్టం (POCSO Act) కింద కేసు నమోదు చేశారు.కాగా, ఎల్‌కేజీ విద్యార్థినిపై లైంగిక దాడికి య‌త్నంపై స్థానికులు, విద్యార్థుల త‌ల్లిదండ్రులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment