బలం లేకున్నా, మేము పోటీ చేస్తాం – బండి సంజ‌య్‌

బలం లేకున్నా, మేము పోటీ చేస్తాం - బండి సంజ‌య్‌

హైదరాబాద్ (Hyderabad) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) బీజేపీ (BJP) తప్పకుండా పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పష్టం చేశారు. కాంగ్రెస్ (Congress), బీఆర్ఎస్ (BRS) పార్టీలు మజ్లిస్ (Majlis) పార్టీని గెలిపించడానికే పోటీకి వెనుకంజ వేస్తున్నాయని ఆయన ఆరోపించారు. “బీఆర్ఎస్‌కు ఎక్కువ మంది కార్పొరేటర్లు ఉన్నా, ఎందుకు పోటీ చేయడం లేదు?” అని ప్రశ్నించిన బండి సంజయ్, “జీహెచ్ఎంసీ (GHMC) లో బీజేపీకి సరిపడా బలం లేకున్నా, మేము పోటీ చేస్తాం. మజ్లిస్‌ను గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ సమగ్ర వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి” అని విమర్శించారు.

దమ్ముంటే వేర్వేరుగా పోటీ చేయండి
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజమైన ప్రతిపక్షంగా ఉంటే, వారు తమ అభ్యర్థులను నిలబెట్టి వేర్వేరుగా పోటీ చేయాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. మజ్లిస్‌కు కృతజ్ఞతగా కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నట్లు ఆయన వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment