మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్రస్తుతం విశ్వంభర మూవీ పనులతో బిజీగా ఉన్నారు. అయితే ఆ మూవీ విడుదల సమీపిస్తున్న నేపథ్యంలో, తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించారు. అయితే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi) తో కలిసి చేయబోతున్నారని, ఆ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన వార్తలు ఇటీవల బయటకొస్తున్నాయి.
చిరు-అనిల్ సినిమాపై తాజా అప్డేట్ ఏంటంటే.. రేపు ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ మూవీ టైటిల్ (Title) గురించి ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. “చిరు నవ్వుల పండగ (Chiru Navvula Pandaga)” అనే టైటిల్ పరిశీలనలో ఉందని సినీ వర్గాలు అంటున్నాయి. చిరు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా టైటిల్‌పై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. త్వరలో అధికారిక ప్రకటన రానుందని భావిస్తున్నారు.