ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లోని సుక్మా జిల్లా (Sukma District)లో శనివారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్ (Encounter) లో 20 మంది మావోయిస్టులు (Maoists) హతమయ్యారు. భద్రతా దళాలకు గోగుండా కొండ (Gogunda hill) పై మావోయిస్టుల కదలికలపై ముందస్తు సమాచారం అందింది. దీంతో పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ (Combing Operation) ప్రారంభించగా, మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. భద్రతా బలగాలు ఎదురుదాడి చేసి 20 మంది మావోయిస్టులను హతమార్చాయి.
కెర్లపాల్ (Kerpal) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు జరిగినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) బలగాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.