ట్రంప్ ప్రకటనకు కెనడా ప్రధాని స్ట్రాంగ్‌ కౌంటర్

ట్రంప్ ప్రకటనకు కెనడా ప్రధాని స్ట్రాంగ్‌ కౌంటర్

అమెరికా (America) తో పాత సంబంధం ముగిసిందని కెనడా ప్రధాని మార్క్ కార్నీ (Mark Carney) కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఇటీవల కెనడా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించడంతో, ఈ ప్రకటనను చేశారు. వాహనాల దిగుమతులపై 25% సుంకం విధించడం అన్యాయమని ఆయన ధ్వజమెత్తారు. అమెరికా నిర్ణయాలు ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తున్నాయని కార్నీ అభిప్రాయపడ్డారు. కెనడా (Canada) పై ఉన్న ప్రాధాన్యతను తగ్గించడమే కాకుండా, ఆర్థిక, భద్రతా, సైనిక సంబంధాలన్నీ ముగిసినట్లే అనిపిస్తోందని ఆయన అన్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవల కెనడాను అమెరికా రాష్ట్రంగా మారుస్తాను అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి తీవ్రంగా స్పందించిన మార్క్ కార్నీ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి, మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించారు. ఏప్రిల్ 28న కెనడాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. బలమైన ప్రభుత్వంతో అమెరికాను ఎదుర్కొంటామన్నారు కార్నీ.

అమెరికా-కెనడా సంబంధాల్లో మరో కీలక మలుపు
కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) స్థానంలో మార్చి 14న మార్క్ కార్నీ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సాధారణంగా, ప్రధానిగా నియమితులైన తర్వాత అమెరికా అధ్యక్షుడితో ఫోన్ సంభాషణ జరుగుతుంది. కానీ ఇప్పటి వరకు ట్రంప్-కార్నీ మధ్య ఎటువంటి అధికారిక చర్చ జరగలేదు. అయితే, వైట్‌హౌస్ (White House) నుంచి ఫోన్ కాల్ షెడ్యూల్ వచ్చిందని, త్వరలోనే ట్రంప్‌తో మాట్లాడతానని మార్క్ కార్నీ వెల్లడించారు. ఈ సంభాషణ తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment