బ్రిటన్ (Britain) రాజు కింగ్ చార్లెస్ III (King Charles III) అస్వస్థతకు గురయ్యారు. క్యాన్సర్ (Cancer) చికిత్స తీసుకుంటుండగా కొన్ని సైడ్ ఎఫెక్ట్ (Side Effects) కారణంగా గురువారం (Thursday) స్వల్పంగా అస్వస్థతకు గురయ్యారని బకింగ్‌హామ్ ప్యాలెస్ (Buckingham Palace) అధికారికంగా ప్రకటించింది. వెంటనే కింగ్ చార్లెస్‌ను ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం క్లారెన్స్ హౌస్‌కి తిరిగి తీసుకెళ్లినట్లుగా సమాచారం. అనారోగ్యం కారణంగా ముందుగా ఖరారైన కింగ్ చార్లెస్ కార్యక్రమాలను రద్దు చేశారు. చార్లెస్ తన ఆరోగ్యం కారణంగా ప్రజలను అసౌకర్యానికి గురిచేసినందుకు క్షమాపణలు (Apologized) చెప్పినట్లు కూడా ప్యాలెస్ ప్రకటనలో పేర్కొంది.
క్యాన్సర్ చికిత్స మధ్యలో మరో పరీక్ష
76 ఏళ్ల చార్లెస్ గత ఏడాది క్యాన్సర్ (Cancer) గా నిర్ధారణ పొందినట్లు ప్రకటించడంతో ఆయన ఆరోగ్యంపై నిరంతరం పరిశీలన కొనసాగుతోంది. క్యాన్సర్ రకాన్ని అధికారికంగా వెల్లడించకపోయినా, చికిత్స తీసుకుంటున్నట్లు మాత్రమే తెలిపారు. గత మూడు నెలలు (Three Months) గా ఆయన ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్నా, ప్రభుత్వ పత్రాలను సమీక్షించడం, ప్రధానమంత్రి (Prime Minister) ని కలవడం వంటి అధికారిక కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తున్నారు.