‘పది’ ప‌శ్నపత్రం లీక్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

'పది' ప‌శ్నపత్రం లీక్.. ముగ్గురిపై సస్పెన్షన్ వేటు

తెలంగాణలో పదో తరగతి (10th class) వార్షిక ప‌రీక్ష ప‌శ్న‌పత్రం లీకేజీలు (Question Paper Leakages) తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న వేళ, తాజాగా కామారెడ్డి (Kamareddy) జిల్లాలోని జుక్కల్ జిల్లా పరిషత్ పాఠశాలలో మరో లీకేజీ జరిగింది.

ఎలా వెలుగుచూసిందంటే..?
పరీక్ష ప్రారంభానికి కొద్దినిమిషాల ముందు పేపర్‌లోని కొన్ని ప్రశ్నలను స్కెచ్‌ పెన్‌తో రాసి బయటకు పంపారు. ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విద్యాశాఖ (Education department) అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లా కలెక్టర్ దర్యాప్తు (Investigation) చేపట్టి, ఘటనలో పాత్ర ఉన్న ముగ్గురు ఉపాధ్యాయులు సునీల్ (జుక్కల్ పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్)[Sunil (Jukkal Exam Center Chief Superintendent)], భీం (డిపార్ట్మెంటల్ ఆఫీసర్)[Bheem (Departmental Officer)], దీపిక (ఇన్విజిలేటర్) [Deepika (Invigilator)]ల‌ను స‌స్పెండ్ చేశారు. అధికారులు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ, లీకేజీలు మాత్రం ఆగడం లేదు. దీనిపై మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు (Parents) డిమాండ్ చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment