హైదరాబాద్ (Hyderabad) క్రికెట్ ఫ్యాన్స్‌కు ఈసారి IPL మరింత మజాగా మారబోతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ (Thaman) తన బ్యాండ్‌తో ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనున్నాడు. ఈ ఏడాది BCCI, IPL మ్యాచ్‌లను మరింత రసవత్తరంగా మార్చేందుకు మ్యూజికల్ ఈవెంట్స్‌ను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా, రేపు ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో జరగబోయే SRH vs LSG మ్యాచ్ తమన్ బ్యాండ్ పెర్ఫార్మెన్స్‌తో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. క్రికెట్ (Cricket) ఉత్సాహాన్ని మరింత పెంచేలా తమన్ శక్తివంతమైన మ్యూజిక్ ప్రదర్శన ఇవ్వనున్నాడు.
SRH vs LSG హెడ్టు టు హెడ్టు రికార్డు..
ఐపీఎల్ 2024లో మిగతా మ్యాచ్‌లతో పోలిస్తే, సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మధ్య జరిగే మ్యాచ్‌కు ఫ్యాన్స్ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐదు సార్లు తలపడగా, లక్నో మూడు విజయాలు సాధించగా, హైదరాబాద్ (Hyderabad) రెండు మ్యాచ్‌లలో గెలిచింది. తొలి మూడు మ్యాచుల్లో లక్నో హవా కొనసాగించగా, గత సీజన్ నుంచి సన్‌రైజర్స్ పుంజుకుని వరుసగా రెండు విజయాలు సాధించింది. ఈసారి ఉప్పల్ స్టేడియం (Uppal Stadium) లో మార్చి 27న జరిగే మ్యాచ్‌పై భారీ అంచనాలున్నాయి.