కల్యాణ్ శంకర్(Kalyan Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మాడ్ స్క్వేర్’ (Mad Square) సినిమా మార్చి 28న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేశారు. అందులో భాగంగా బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు.
లడ్డు గాడి పెళ్లి ముచ్చటతో మొదలైన ఈ ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు నవ్వులు పూయించేలా ఉంది. ఫుల్-ఆన్ కామెడీ, రసవత్తర సన్నివేశాలతో రూపొందిన ఈ చిత్రంలో నార్నే నితిన్(Narne Nithin), రామ్ నితిన్(Ram Nithin), సంగీత్ శోభన్(Sangeet Sobhan), విష్ణు ఓయ్, రెబా మోనికా జాన్(Reba Monica John), మరియు సత్యం రాజేష్ నటించారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమా నిర్మించాయి, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, థమన్ నేపథ్య సంగీతం అందించాడు.
ట్రైలర్ చూసిన ప్రేక్షకులు, సినిమా కూడా మ్యాడ్() మొదటి పార్ట్ స్థాయిలో వినోదాన్ని అందిస్తుందేమోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హాస్యభరిత కథనంతో ప్రేక్షకులను అలరించనున్న ‘మాడ్ స్క్వేర్’ బక్సాఫీస్ వద్ద ఏ విధమైన వసూళ్లు రాబట్టనుందో వేచి చూడాలి. ‘మాడ్ స్క్వేర్’ టికెట్ ధర పెంపు కోసం ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.