వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ నీచ‌మైన కామెంట్స్‌

వార్నర్‌పై రాజేంద్రప్రసాద్ నీచ‌మైన కామెంట్స్‌

హీరో నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన “రాబిన్ హుడ్” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో అద్భుతమైన ప్రెజెన్స్ ఇచ్చిన అతిథుల్లో ఆసక్తికరమైన పేరు.. ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్. అయితే, ఈ వేడుకలో డేవిడ్ వార్న‌ర్‌ను ఉద్దేశించి సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ నీమైమైన కామెంట్స్ చేశారు. రాజేంద్ర‌ప్ర‌సాద్ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

స్టేజ్‌పై మాట్లాడిన రాజేంద్రప్రసాద్.. వార్నర్‌ను ఉద్దేశించి, “రేయ్.. వార్న‌ర్‌, పెద్ద దొంగ ము*డా కొడుకు మామూలోడు కాదండీ వీడు అంటూ అనుచిత వ్యాఖ్య‌లు చేశాడు. క్రికెట్ ఆడమంటే యాక్టింగ్ చేస్తున్నాడు.. అంటూ రాజేంద్ర‌ప్ర‌సాద్ చేసిన కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. అంత‌ర్జాతీయ ప్లేయ‌ర్‌పై అహంకార‌పూరిత‌మైన‌ వ్యాఖ్య‌లు ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అనుభ‌వంతో హుందాగా మాట్లాడాల్సిందిపోయి.. వేదిక‌పైన‌ నీచ‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం ఏంట‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను నిల‌దీస్తున్నారు. ఇక‌నైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడ‌టం నేర్చుకోవాల‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment