అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

అయ్యో.. వీధి లైట్లే వారికి దిక్కా..

ఒకవైపు టెన్త్ పరీక్షలు.. మరోవైపు చదువుకుందామంటే ఇంట్లో చిమ్మ చీకటి.. ఏం చేయాలో అర్థం కాక చివరికి వీధి లైట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి. ఏ వైపు నుంచి ఏ విష కీటకం వస్తుందో తెలీదు..ఇంకో వైపు దోమల కాటు.. వీధికుక్కల గోల.. ఇన్ని ఆటంకాల మధ్య టెన్త్ పరీక్షలకు సన్నద్ధమవ్వక తప్పని ప‌రిస్థితి. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆకివీడు గుమ్నూర్‌సెంట‌ర్ బాబూ జ‌గ్జీవ‌న్ రామ్‌ కాల‌నీలో కొందరు విద్యార్థుల దుస్థితి ఇది.

ఈ కాలనీలో పోరంబోకు స్థలంలో ఇళ్లు నిర్మించారంటూ అధికారులు ఆ ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లు కట్ చేశారు. దీంతో ఆ ఇళ్లలో నివసించే కొందరు టెన్త్ విద్యార్థులకు పరీక్షలకు చదుకునే అవకాశం లేకుండా పోయింది. దిక్కులేని పరిస్థితుల్లో వీధిలైట్లను ఆశ్రయించారు. నాడు వీధిలైట్ల కింద చదువుకున్న అంబేద్కర్.. ఎవరికీ అటువంటి దుస్థితి రాకూడదని రాజ్యాంగంలో బడుగు, బలహీన, దళిత వర్గాలకు ప్రత్యేక అవకాశాలు కల్పించారు. కానీ నేటి పాలకుల తీరుతో మళ్లీ పాత రోజులు దాపరించాయి.

ప‌రీక్ష‌ల వ‌ర‌కైనా విద్యుత్ స‌ర‌ఫ‌రాను కొన‌సాగించండి అని ప్ర‌భుత్వాన్ని, అధికారుల‌ను విద్యార్థులు అభ్య‌ర్థించిన వీడియో సోష‌ల్ మీడియాలో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఈ వీడియో చేసిన వారంతా ప్ర‌భుత్వాధికారుల తీరును త‌ప్పుబ‌డుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment